మడమ తిప్పానూ… మాట తప్పను అంటే ఇదేనా జగన్?

YSRCP Suspended Leader Goutham Reddy Meets YS Jaganవిలువలు విశ్వసనీయత అంటూ తరచు మాట్లాడతారు జగన్ మోహన్ రెడ్డి. అయితే మాటలు తేలికే గాని వాటిని పాటించడం కష్టమే. ఆ విషయం ఆయనే రోజువు చేశారు. కొద్దీ నెలల క్రితం ఒక టీవీ ఇంటర్వ్యూలో పార్టీ సీనియర్ నేత గౌతమ్ రెడ్డి కాపు ఐకాన్ వంగవీటి మోహన రంగాపై కొన్ని పరుష వ్యాఖ్యలు చేశారు.

ADVERTISEMENT

రంగాను ఒక వీధి రౌడీతో పోల్చారు. ఆయన చావును అపహాస్యం చేసారు. దీనిపై ఆయన కుమారుడు రాధా మరియు కాపు సమాజం భగ్గుమంది. వెంటనే ఆయనకు షో కాస్ నోటీసు ఇచ్చింది వైకాపా. కాపు తిరుగుబాటుకు భయపడి ఆయన సమాధానం చెప్పేలోపే పార్టీ నుండి సస్పెండ్ చేసారు.

అయితే గౌతమ్ రెడ్డి జగన్ పాదయాత్రలో ప్రత్యక్షమయ్యి జగన్ పక్కనే నడిచారు. జగన్ తో మాటామంతీ కూడా నడిపారు. దీనిబట్టి అప్పటి సస్పెన్షన్ అంతా హంబక్ అని తేలిపోయింది. మడమ తిప్పానూ… మాట తప్పను అంటే ఇదేనా జగన్? అని సోషల్ మీడియాలో అంతా ప్రశ్నిస్తున్నారు.

ఈ సంఘటన తరువాత వంగవీటి రాధా పార్టీ వీడడం దాదాపుగా కన్ఫర్మ్ అనే చెప్పుకోవాలి. కాపులు కూడా జగన్ పై కోపం తెచ్చుకోవడం ఖాయం. ప్రస్తుత తరుణంలో ఇది అనాలోచిత చర్య అనే చెప్పుకోవాలి. తొందర్లో జగన్ పాదయాత్ర గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు జగన్ కు ఇబ్బందులు ఎదురు అవ్వొచ్చు.

ADVERTISEMENT
Latest Stories