వైసీపీ అధినేత వైఎస్ జగన్ పరామర్శ పేరుతో బయటకొచ్చినా పార్టీ శ్రేణులు మాత్రం దానిని ఒక రాజకీయ పర్యటనగా మార్చేస్తూ పరామర్శను బలప్రదర్శనగా చిత్రీకరిస్తున్నారు. రప్ప రప్ప అంటూ నినాదాలు చేస్తూ రోడ్ల మీద నానా హంగామా సృష్టిస్తున్నారు.
తాజాగా నేడు పలాస మాజీ వైసీపీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు తో జగన్ మూలకత్ కార్యక్రమంలో కూడా వైసీపీ నేతల అత్యుత్సహం మరో అడుగు ముందుకెళ్లింది. జగన్ పర్యటనలో రోడ్ షోలు, జనసమీకరణలు చేయకూడదని పోలీసులు ఆంక్షలు పెట్టినా వైసీపీ నేతలు వాటిని బేఖాతరు చేస్తూ తిరిగి అదే పోలీసుల పై దౌర్జన్యానికి దిగారు.
మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు తనయుడు రామ్మనోహర్ నాయకత్వంలో జగన్ కు మద్దతుగా భారీగా వచ్చిన పార్టీ శ్రేణులు జైలుకి ఒక్క కిలోమీటర్ దూరంలో పోలీసులు ఏర్పాటు చేసిన బారిగేట్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. ఆ క్రమంలోనే వారు అక్కడ డ్యూటీ లో ఉన్న ప్రవళిక అనే ఒక మహిళా ఎస్ఐ మీద దౌర్జన్యానికి పాల్పడ్డారు.
ఒక మహిళ అనే కనీస సంస్కరం కూడా లేకుండా సదరు ఆముదాల వలస వైసీపీ ఇంచార్జ్ చింతాడ రవి కుమార్ తన అనుచరులతో కలిసి మహిళా ఎస్ఐ ని చుట్టుముట్టి ఆమెను చేతులతో వెనక్కి నెడుతూ చాల దురుసుగా ప్రవర్తించారు. ఈ చర్యతో సదరు మహిళా అధికారి ఒక్కసారిగా అభద్రతా భావానికి గురైనట్టు వీడియో ఫోటేజ్ లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహిళల పట్ల వైసీపీ ‘సంస్కారం’ ఇదేనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జగన్ యాత్రలు ఒక మహిళా అధికారికి కూడా భద్రతా లేకుండా చేస్తున్నాయా.? ఒక పోలీస్ అధికారి పైనే వైసీపీ నేతలు ఈ రకమైన దౌర్జన్యానికి పాల్పడితే ఇక సామాన్య మహిళల పట్ల వైసీపీ నేతల అరాచకం ఏ స్థాయిలో ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు జగన్ వెళ్లిన పరామర్శకే ఒక అర్ధం లేదని సామాన్య ప్రజానీకం భావిస్తున్న ఈ తరుణంలో ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఇలా ఒక మహిళా అధికారి పట్ల ప్రవర్తించిన తీరు అత్యంత వివాదాస్పదంగా మారనుంది. గతంలో బాబు సతీమణి నారా భువనేశ్వరి పట్ల, జగన్ సొంత సోదరి షర్మిల, సునీత పట్ల, తల్లి విజయమ్మ గురించి కూడా వైసీపీ శ్రేణులు అత్యున్నత నీచమైన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
మరి ఇప్పుడు ఒక మహిళా అధికారి పై వైసీపీ నేతలు చేతులు వేస్తూ చేసిన ఈ దుశ్చర్య ను కూడా పార్టీ అధినేతగా వైఎస్ జగన్ ఇప్పటికైనా ఖండిస్తారా.? లేదా పార్టీ నేతలు చిన్నపిల్లలు అని ఎదో తెలిసి తెలియక చేసిన తప్పుగా భావించి వారికీ అండగా నిలుస్తారా.? లేదా బాధిత అధికారి పక్షాన నిలబడి పార్టీ నేతలను క్రమశిక్షణా నేరం కింద దండిస్తారా.?
డ్యూటీ లో ఉన్న SI ఆమె..అదీ మహిళ అనికూడా చూడకుండా Ysrcp వాళ్ళు ఎలా దాడికి వెళ్తున్నారో చూడండి..ఒక్కొక్కడినీ తీసుకెళ్లి బొక్కలో వేసి మక్కెలు విరగదీయకపోతే ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం కిందే లెక్క.. pic.twitter.com/hxUHwtbDJ4
— ఆంధ్రుడు (@Gogineni_Pa1onX) July 30, 2026




