
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి గత ఏడాది దావోస్ సదస్సు నుంచి తన రాష్ట్రానికి సుమారు రూ.40,000 కోట్లు పెట్టుబడులు సాధించుకున్నారు. ఈ ఏడాది సదస్సులో ఏకంగా దానికి మూడు రెట్లు కంటే ఎక్కువే అంటే రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించుకొని హైదరాబాద్ తిరిగి వెళుతున్నారు.
కనుక ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీతో వేగుతున్న ఆయనకు ఇది చాలా ఆత్మవిశ్వాసం కలిగిస్తుందని భావించవచ్చు. ఈ భారీ పెట్టుబడులతో కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో, కాంగ్రెస్ అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి పరపతి మరింత పెరుగుతుంది.
Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?
రేవంత్ రెడ్డి హామీలు అమలుచేయలేక చేతులెత్తేసి మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారంటూ బిఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టి, దావోస్ సదస్సులో సాధించిన ఈ పెట్టుబడుల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఎంత మేలు జరుగబోతోందో ప్రజలకు చెప్పుకొని వారిని ప్రసన్నం చేసుకొనే అవకాశం కూడా ఆయనకు లభిస్తుంది.
ఈ భారీ పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందేందుకు, మరింత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తోడ్పడతాయని వేరే చెప్పక్కరలేదు.
Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?
అమెజాన్, విప్రో, సన్ పెట్రో కెమికల్స్, జేఎస్‌డబ్ల్యూ వంటి దిగ్గజ సంస్థలు తెలంగాణకు తరలివస్తుండటం, ఆ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి, రాజకీయ సుస్థిరతకి అద్దం పడుతున్నాయని చెప్పొచ్చు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పుడు చాలా సానుకూల రాజకీయ వాతావరణం నెలకొని ఉన్నప్పటికీ ‘జగన్ భయంతోనే’ పారిశ్రామికవేత్తలు, ఐటి కంపెనీలు తెలంగాణ వైపు మొగ్గు చూపారని భావించవచ్చు.
Also Read – జగన్ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?
కానీ వచ్చే ఏడాది దావోస్ సదస్సు జరిగే నాటికి అమరావతి, పోలవరం పనులు జోరుగా సాగుతుంటాయి. అప్పటికి రాష్ట్రంలో మౌలిక వసతులు మరింత పెరుగుతాయి.
ముఖ్యంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, కొత్త పోర్టులు, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, మిట్టల్ స్టీల్ ప్లాంట్, రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనేక పరిశ్రమలు ఏర్పాటవుతుంటాయి. కనుక వాటన్నిటినీ చూసి పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తప్పక ముందుకు వస్తారు.
అయితే దావోస్ సదస్సులో తెలంగాణ రాష్ట్రానికి ఇంత భారీగా పెట్టుబడులు రాగా ఏపీకి ఒక్కటీ రాకపోవడంతో సిఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ విమర్శలు గుప్పించడానికి అవకాశం లభించిన్నట్లే. కనుక వాటిని పైన పేర్కొన్న అభివృద్ధి పనులతోనే ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా పారిశ్రామికవేత్తలకు, ఐటి కంపెనీలు కంపెనీలకు ఈ ‘జగన్ భయం’ నుంచి బయట పడేసేందుకు సిఎం చంద్రబాబు నాయుడు తగు రాజకీయ చర్యలు కూడా తీసుకోవలసి ఉంటుంది.