తొలి రోజు సదస్సులోనే తెలంగాణకు 600 కోట్లు పెట్టుబడులు..మరి ఏపీకి?

600 crore investment for Telangana what for andhra pradaeshఈ నెల 22 నుంచి దావోస్‌లో ప్రారంభమైన ప్రపంచ ఆర్ధిక సదస్సులో ఏపీ నుంచి సిఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు, అధికారుల బృందం పాల్గొనగా, తెలంగాణ నుంచి ఆ రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ నేతృత్వంలో అధికారుల బృందం పాల్గొంది.

గత మూడేళ్ళలో ఏపీలో అప్పులు, సంక్షేమ పధకాలు, తాజాగా పరిశ్రమలకు కరెంట్ కోతలు తప్ప మరేమీ చెప్పుకోవడానికి లేనందున, సిఎం జగన్మోహన్ రెడ్డి ఎంత అనర్గళంగా ప్రసంగించినా ఏపీకి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాలేదు. కానీ ముందే చెప్పినట్లు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తొలిరోజునే తన రాష్ట్రానికి రెండు సంస్థల నుంచి రూ.600 కోట్ల పెట్టుబడులు సంపాదించారు.

ADVERTISEMENT

మన రాష్ట్రంలో నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు ఉన్నాయని కనుక వాటిని చూసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సిఎం జగన్మోహన్ రెడ్డి కోరడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ పోర్టులు, ఎయిర్ పోర్టులను చూపి పెట్టుబడులు వస్తాయనుకొంటే, ఒక్క పోర్టు కూడా లేని, ఒకే ఒక విమానాశ్రయం ఉన్న తెలంగాణ రాష్ట్రానికి రూ.600 కోట్లు పెట్టుబడులు వస్తే, ఆ లెక్కన 4 పోర్టులు, 5 విమానాశ్రయాలు ఉన్న మన రాష్ట్రానికి ఎంత పెట్టుబడులు రావాలి?

సిఎం జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళి గుజరాత్‌కు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీని కలిసి ‘ఏపీలో వనరులు పెట్టుబడులకు గల అవకాశాలను వివరించే ఓ పుస్తకాన్ని ఇచ్చి ఆయనతో ఫోటో తీయించుకొంటే, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ యునైటడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన ప్రముఖ ఆహార పరిశ్రమ లులూ గ్రూప్ ప్రతినిధులతో సమావేశమయ్యి తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని పెట్టేందుకు ఎంఓయు చేసుకొని వారితో ఫోటో దిగారు.

సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రపంచ ఆర్ధిక సదస్సు, ఆంధ్రప్రదేశ్‌తో కలిసి పనిచేసేందుకు అగ్రిమెంట్ చేసుకొని వారితో ఫోటోలు దిగితే, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పెయిన్ దేశానికి చెందిన కీమో ఫార్మా కంపెనీతో రూ.100 కోట్లతో తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేసుకొనేందుకు ఎంఓయూ చేసుకొని వారితో ఫోటో దిగారు.

ఈ రెండుకాక స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ మరియు భీమా సంస్థ స్వీస్ రే, ఈ కామర్స్ సంస్థ మీషో హైదరాబాద్‌లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు మంత్రి కేటీఆర్‌ ఒప్పించారు.

మిగిలిన ఈ రెండు రోజులలో మంత్రి కేటీఆర్‌ బృందం తమ తెలంగాణ రాష్ట్రానికి మరో రూ5-600 కోట్లు పెట్టుబడులు ఆకర్షించినా ఆశ్చర్యం లేదు. కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఏమి సాధించుకు వస్తారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories