2024 లగడపాటి సర్వే ఇదేనా?

Aara Mastan Lagadapati

కొద్ది సేపటి క్రితం పలు ప్రముఖ మీడియా, సర్వే సంస్థలు ఏపీ శాసనసభ ఫలితాలపై తమ అంచనాలను తెలియజేస్తూ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. వాటిలో చాణక్య స్ట్రాటజీస్, పీపుల్ పల్స్, పయనీర్ పోల్ స్ట్రాటజీస్, పల్స్ టుడే తదితర ఓ పది సంస్థలు టిడిపి కూటమి కనీసం 114 నుంచి 135 సీట్లు గెలుచుకొని పూర్తి మెజార్టీతో అధికారంలోకి రాబోతోందని తేల్చి చెప్పేశాయి.

అయితే ఆరా మస్తాన్, పార్ధ చాణక్య, ఆత్మసాక్షి ఎస్ఏఎస్ మూడు సంస్థలు మాత్రం వైసీపి 94 నుంచి 120 సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి రాబోతోందని చెప్పాయి. అవి టిడిపి కూటమికి 55 నుంచి 81 సీట్ల లోపు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పాయి.

ADVERTISEMENT

ఆరా మస్తాన్ నివేదిక ప్రకారం వైసీపి 49.1 శాతం ఓట్లు, 94-101 సీట్లు సాధించి ఏపీలో మళ్ళీ అధికారంలోకి రాబోతోంది. టిడిపి కూటమి కంటే సుమారు 2 శాతం అధిక ఓట్లు శాతంతో 20-25 ఎక్కువ సీట్లతో వైసీపి మళ్ళీ అధికారంలోకి రాబోతోంది.

టిడిపి కూటమి 47.55 శాతం ఓట్లు సాధించి 71-81 సీట్లతో రెండో స్థానానికే పరిమితం కాబోతోంది. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్ధులు 3.4 శాతం ఓట్లు సాధించబోతున్నారని ఆరా మస్తాన్ నివేదికలో పేర్కొంది.
లగడపాటి రాజగోపాల్‌కు ఎన్నికల సర్వేలో మంచి పేరు ఉండేది. 2014 ఎన్నికలలో ఆయన చెప్పిన లెక్కలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ 2019లో తప్పుడు అంచనాలు ప్రకటించి ఆ పేరు పాడుచేసుకున్నారు. అదేవిదంగా ఆరా మస్తాన్ 2019 ఎన్నికలలో ప్రకటించిన అంచనాలు ఫలించాయి.

కానీ రాష్ట్రంలో మారిన రాజకీయ బలాబలాలు, సమీకరణాలు, ప్రజల మూడ్, జగన్‌ ప్రభుత్వ తప్పిడాలను వేటినీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రజలు వైసీపికి 49.1 శాతం ఓట్లు, 94-101 సీట్లతో మళ్ళీ పట్టం కట్టబోతున్నారని చెప్పడమే కాకుండా తమ ఈ అంచనాలు తప్పి ఏపీలో టిడిపి కూటమి గెలిచిన్నట్లయితే శాశ్వితంగా ఈ పోలింగ్‌ సర్వే నుంచి తప్పుకుంటామని ఆరా మస్తాన్ తెలిపారు.

గత ఎన్నికలలో వైసీపి 49.95 శాతం ఓట్ షేర్ సాధించి 151 సీట్లు గెలుచుకోగా, ఈసారి 49.1 శాతం ఓట్లు, కేవలం 94-101 సీట్లు మాత్రమే గెలుచుకోబోతోందని ఆరా మస్తాన్ చెపుతున్నారు. కానీ ఈసారి వైసీపి ఓటు షేరు తగ్గదని చెప్పడం ఆరా మస్తాన్ చెప్పడం తప్పుడు లెక్కలే కదా?

2019 ఎన్నికలలో టిడిపి నేతలు బెట్టింగ్ చేసి మునిగిపోగా, ఆరా మస్తాన్ వంటివారి ఇటువంటి నివేదికలు చూసి ఈసారి వైసీపి నేతలు బెట్టింగ్ చేసి మునిగిపోయేలా ఉన్నారు.

ADVERTISEMENT
Latest Stories