
ఐఏఎస్, ఐపీస్ అధికారులు రాజకీయ ఒత్తిళ్ళకు, ప్రలోభాలకు లొంగకుండా పనిచేసే రోజులు ఎప్పుడో పోయాయి. కనుకనే ప్రభుత్వం మారిన ప్రతీసారీ కొందరు అధికారులు బలవుతుంటారు. కొందరు ఓ వెలుగు వెలుగుతుంటారు.
ఇదివరకు అంటే 2014-19లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పనిచేసిన ఐపీస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావుపై జగన్ ఎంతగా కక్ష సాధించారో అందరూ చూశారు.
Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?
కానీ జగన్ చేసింది తప్పని, తక్షణం ఆయనని మళ్ళీ పదవిలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు గట్టిగా చెప్పడంతో సుప్రీం ఆదేశం పాటించక తప్పలేదు. కానీ పదవీ విరమణ సమయం దగ్గర పడే వరకు నాన్చుతూ చివరిలో డ్యూటీలో చేరేందుకు అనుమతించారు. కానీ సుప్రీంకోర్టు ఆదేశించినా ఆయన బకాయిలు చెల్లించనే లేదు.
జగన్ హయంలో కూడా పలువురు ఐఏఎస్, ఐపీస్ అధికారులు తమ పరిధిని అతిక్రమించి చంద్రబాబు నాయుడుని టీడీపీ నేతలను చాలా ఇబ్బంది పెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించలేదు.
Also Read – గెట్ రెడీ..స్టే ట్యూన్డ్ టూ ‘తాడేపల్లి ఫైల్స్’..!
వారందరికీ పోస్టింగ్స్ ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. వారిలో పదవీ విరమణ చేస్తున్నవారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించి సగౌరవంగా సాగనంపుతున్నారు. చంద్రబాబు నాయుడుకి, జగన్మోహన్ రెడ్డికి తేడా ఇదే.
ఇక జగన్ హయాంలో ఏబీ వేంకటేశ్వర రావుకి జరిగిన అన్యాయం, అవమానాలకు గాను ఆయనకు న్యాయం చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు భావించారు. కనుక ఆయనని ఏపీ పోలీస్ గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?
జగన్ హయంలో ఆయన కోల్పోయిన రెండేళ్ళు ఇప్పుడు ఈ పోస్టుతో తిరిగి ఇచ్చారు. అంటే ఆయన ఈ పదవిలో రెండేళ్ళపాటు అధికారంలో ఉంటారన్న మాట!
సీనియర్ ఐపీస్ అధికారిగా ఆయనకు అపారమైన అనుభవం ఉంది. పోలీస్ శాఖలో ప్రతీ విభాగం గురించి పూర్తి అవగాహన ఉంది. కనుక ప్రస్తుతానికి పోలీస్ హౌసింగ్ బాధ్యతలే అప్పగించినప్పటికీ భవిష్యత్‌లో వేరే అవసరాలకు ఆయన సేవలు వినియోగించుకునే అవకాశం కూడా ఉంటుంది.