రెంటికి చెడ్డ రేవడి…ఇది రాస్కో సాంభా..!

Actor Ali Resigns From YCP

జగన్ ను నమ్ముకుని రాజకీయాలు చేస్తే ఏమవుతుందో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుండి వార్డు వాలంటీర్ల వరకు అందరికి ఒక స్పష్టత వచ్చింది. అయితే వీరి బాటలోనే నడవడానికి కమెడియన్ ఆలీ కూడా ముందుకొచ్చారు.

జగన్ తనకు అండగా ఉంటారు అనే నమ్మకంతో తనను ఎంతగానో నమ్మిన స్నేహితులను కూడా దూరం చేసుకుని, తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన ఇండస్ట్రీ ను కూడా కాదనుకుని వైసీపీ జెండా పట్టుకుని రాజకీయం మొదలుపెట్టారు అలీ.

ADVERTISEMENT

అయితే జగన్ మాత్రం ఈయనను పార్టీ జెండా పట్టుకోవడానికి, పవన్ ఎజెండాను విమర్శించాడనికే వాడుకున్నారు కానీ అలీకి ఆశించిన స్థాయి కల్పించలేకపోయారు. జగన్ ను మెప్పించడానికి తనకు స్థాయికి మించి గౌరవం ఇచ్చిన పవన్ మీద పోటీ చేయడానికి కూడా సిద్ధం అంటూ ప్రకటనలు చేసారు అలీ.

అలీ చేసిన ప్రకటనలను పట్టించుకోలేదు, అలీని పట్టించుకోలేదు జగన్. దీనితో రెంటికి చెడ్డ రేవడి మాదిరి జగన్ ను నమ్ముకుని అటు స్నేహితుడు పవన్ ను దూరం చేసుకున్నారు, ఇటు సినీ పరిశ్రమకు దూరమయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో సినీ పరిశ్రమ పై జగన్ ఉక్కుపాదం మోపడంతో జగన్ కు అనుకూలంగా ఉన్న ఇండస్ట్రీ వారికీ ఇప్పుడు టాలీవుడ్ లో అవకాశాలు దక్కే పరిస్థితి ఉంటుందా.?

జగన్ ప్రభుత్వం పై టాలీవుడ్ ప్రముఖులలో వ్యతిరేకత ఏస్థాయిలో ఉందో రామోజీరావు సంస్మరణ సభలో కీరవాణి వ్యాఖ్యలు చూస్తే అర్ధమవుతుంది. వైసీపీ పార్టీ ఘోర ఓటమితో తత్త్వం బోధపడిన నటుడు అలీ వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకుంటున్నా అంటూ వెల్లడించారు. వైసీపీ పార్టీ తరుపున ఎమ్మెల్యే గా పోటీ చేయాలని ఆశించిన అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు జగన్.

అయితే తానొకటి తలిస్తే తమ అధినేత మరొకటి ఇవ్వడంతో అలక పూనిన అలీ ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉండిపోయారు. చివరికి ఎమ్మెల్యే గా పోటీ చేయాలనీ అనే కల తీరకుండానే రాజకీయాలు నుండి నిష్క్రమించారు అలీ. దీనితో కుక్క తోక పట్టుకుని గోదారి ఈదడం…జగన్ పార్టీని నమ్ముకుని రాజకీయంగా ఎదగాలనుకోవడం రెండు ఒక్కటే…ఇది రాస్కో సాంబా అంటూ అలీ కి సలహాలిస్తున్నారు పవన్ అభిమానులు.

జగన్ తమకు కొండంత అండ అని భావించిన ఆర్జీవీ కూడా జగన్ ఓటమితో ఇక రాజకీయ సినిమాలకు దూరంగా ఉంటానంటూ ప్రకటించి తన X ఖాతాకు నోరుమూసారు. ఇక మెంటల్ కృష్ణాగా ఫేమస్ అయిన పోసాని ఒక్కరే మిగిలారు. కాలర్ వెనకేసుకొని రాజా… రాజా అంటూ మీడియా ముందుకొచ్చి పిచ్చి ప్రేలాపనలు చేసే పోసాని వైసీపీ పార్టీకి ప్రజలు కొట్టిన దెబ్బతో నిజంగా పిచ్చివాడిగా మారిపోయారేమో మరి..!

ADVERTISEMENT
Latest Stories