actor-prudhvi-tweets

విశ్వక్‌ సేన్‌ తాజా సినిమా ‘లైలా’ భారీ అంచనాలు, అనేక వివాదాల నడుమ విడుదలై బోర్లా పడింది. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృధ్వీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మండిపడిన వైసీపీ శ్రేణులు #బాయ్‌కాట్ లైలా అంటూ ప్రచారం చేశారు.

కనుక సినిమాని కాపాడుకోవడం కోసం అప్పుడు పృధ్వీతో సహా అందరూ వారికి క్షమాపణలు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా ఎలాగూ పోయింది కనుక ఇప్పుడు పృధ్వీ ఆ సారీని వెనక్కు తీసుకొని, జగన్‌ మీద మళ్ళీ బాణాలు వేయడం మొదలుపెట్టారు.

Also Read – జగన్‌ పొమ్మన్నారు బాబు రమ్మన్నారు.. అశోక్ లేలాండ్‌ని

రంగస్థలం సినిమాలో పాటకి పేరడీగా “ఈ చేతితోనే పధకాలు పెట్టాను.. ఈ చేతితోనే డబ్బులు పంచాను… ఈ చేతితోనే బటన్లు నొక్కాను.. ఈ చేతితోనే రాష్ట్రాన్ని దోచాను.. ఇన్ని చేసిన నాకు పదకొండే ఇస్తారా.. ఓరయ్యో నా అయ్యా..” అంటూ చిన్న పాట పాడారు.

దానిని వివరిస్తూ, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు, “ఓరయ్యో నా అయ్యా..” అంటూ ఇప్పుడు బాధపడటం కంటే అధికారంలో ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఉండి ఉంటే నేడు జగన్‌కి, వైసీపీకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా?” అని అన్నారు.

Also Read – పాదయాత్ర: చరిత్ర కాదు…భవిష్యత్తే..!

ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత జగన్‌ పార్టీ నేతలతో మాట్లాడుతూ “సంక్షేమ పధకాల పేరుతో అక్కమ్మలు, చెల్లెమ్మలకు ఎంతో డబ్బు పంచాను. కానీ వాళ్ళు మనకి ఎందుకు హ్యాండ్ ఇచ్చారో?” అని జగన్‌ వాపోయారు. అంటే ఇప్పుడు పృధ్వీ చెప్పిందే నాడు జగన్‌ కూడా చెప్పారన్న మాట! కనుక ఈ పాట కాస్త చురుక్కుమనిపించినా అది వాస్తవమే అని అందరికీ తెలుసు.

కానీ ఎవరు అవునన్నా కాదన్నా ఏపీలో నేటికీ వైసీపీ బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు ఉన్నాయి. కనుక జగన్‌కి వ్యతిరేకంగా ఈవిదంగా మాట్లాడుతూ, పాటలు పాడుతున్న పృధ్వీని తమ సినిమాలలో తీసుకునేందుకు దర్శక నిర్మాతలు ఇష్టపడకపోవచ్చు. అదే జరిగితే వైసీపీ ఏమీ చేయకపోయినా థర్టీ ఈయర్స్ ఇండస్ట్రీ మూతపడటం ఖాయం. కనుక పృధ్వీ నోరు అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది.

Also Read – ఏపీ ప్రోగ్రాస్ రిపోర్ట్