ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె, దర్శకురాలు సౌందర్య ప్రయాణిస్తున్న కారు ఓ ఆటో రిక్షాను ఢీకొట్టింది. చెన్నైలోని ఆళ్వార్‌పేట్ ప్రాంతంలో కారులో వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌కి గాయాలు కాగా, కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ ప్రమాద వార్త తెలియగానే సౌందర్య బావ, హీరో ధనుష్ అక్కడకు చేరుకున్నాడు.
పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళుతున్న ఆటో డ్రైవర్‌కి నచ్చజెప్పి అతడి వైద్యానికయ్యే ఖర్చులు భరిస్తామని, పరిహారం ఇస్తామని చెప్పాడు. ఆటో డ్రైవర్ అందుకు అంగీకరించడంతో, సమస్య అక్కడితో సర్దుమణిగింది. ఈ సమయంలో సౌందర్య కారును స్వయంగా నడిపారా? లేక డ్రైవర్ ఉన్నాడా? అన్న విషయం గురించి సమాచారం అందలేదు. మరో పక్కన ధనుష్ తన కొడుకేనంటూ జరుగుతున్న కేసులో కూడా కోర్టుకు హాజరైన ధనుష్ పుట్టుమచ్చలను చూపించగా, తదుపరి విచారణ మార్చి 2వ తేదీకి వాయిదా పడింది.



