ఎంతో వైభవంగా జరిగిన అక్కినేని అఖిల్ – శ్రియా భూపాల్ ల నిశ్చితార్ధ వేడుకకు అర్ధం లేదనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఒక రకంగా నాగ్ పెద్ద కొడుకు అయిన నాగచైతన్య కంటే ముందుగానే అఖిల్ వివాహం జరుగుతుందనే విషయం ఖరారు కావడం, అందుకు తగిన విధంగా ఇటలీలో ఏర్పాట్లు జరగడం అంతా పక్కా ప్రణాళిక ప్రకారం సిద్ధమైంది. కానీ, ఉన్నట్లుండి ఈ వేడుక రద్దు కావడం, అలాగే బుక్ చేసుకున్న టికెట్లు కూడా కాన్సిల్ చేసుకోవడం వంటివి వడివడిగా జరిగిపోయిందన్న సమాచారంతో, విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయని అర్ధమవుతోంది.
అయితే ఇవి ఇరు కుటుంబాల మధ్య తలెత్తిన విభేదాలు కావు, దంపతులు కావాలనుకున్న అఖిల్ – శ్రియాల మధ్యనే తలెత్తాయని, ఇద్దరికీ పెద్దలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, ఇద్దరూ వినలేదని హాట్ హాట్ గా ట్రేడ్ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మరి అంతలా అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిన ఆవశ్యకత అఖిల్ కు ఎంతైనా ఉంది. సోషల్ మీడియాలో నిత్యం తన భావాలను వ్యక్తపరిచే అఖిల్, కనీసం దీనిపై స్పష్టత ఇస్తే, మీడియాలో హల్చల్ చేసే హాట్ న్యూస్ ను బ్రేక్ చేసిన వారవుతారు, లేదంటే మసాలా ఎక్కువై అది కంపు కొట్టే ప్రమాదం ఉంది.



