ys-jagan-akhilesh-yadav

ఇదివరకు జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి మోడీ, అమిత్ షాలతో భేటీ అయినప్పుడు అప్పులు, కేసుల కోసమే తిరుగుతున్నారని గిట్టనివారు చెవులు కొరుక్కునేవారు. అది నిజమేనని ఓ బీజేపీ పెద్దాయన కూడా చెప్పారు.

Also Read – జగన్ అనుకున్నట్టే బట్టలు ఊడతీస్తున్నారుగా…

సరే ఇప్పుడు జగన్‌ జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే. అయినా కూడా జగన్‌ ఢిల్లీలో ధర్నా చేస్తుంటే గిట్టనివాళ్ళు మళ్ళీ చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు.

పాత కేసులలో ఉపశమనంతో పాటు కొత్త కేసుల నుంచి రక్షణ కోసం మోడీ, అమిత్ షాలను కలిసేందుకే ఢిల్లీలో ధర్నా పెట్టుకున్నారని లేకుంటే శాసనసభ ఎదుట లేదా తన విశాఖ రాజధానిలోనో ధర్నా చేసుకునే వారే. కానీ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలవుతుంటే ఢిల్లీలో ధర్నా అవసరమా?అంటే అత్యవసరమే అని మరికొందరు వాదిస్తున్నారు. అయితే జగన్‌ చెపుతున్న కారణాల కోసం కాదని చెపుతున్నారు.

Also Read – గంట అరగంట వీరులకు అర్దమైంది కానీ దువ్వాడకు అర్ధం కాలే.. అందుకే..

ప్రస్తుతం ఎన్డీయేలో చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు. కనుక మోడీ, అమిత్ షాలు జగన్‌కి ‘రక్షణ కవచం’ ఆఫర్ చేయకపోవచ్చని, కనుక కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్ళేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌ స్నేహ హస్తం అందిస్తే ముందుగా పక్కలో బల్లెంగా మారిన చెల్లి షర్మిలని వదిలించుకోవచ్చు. ఆ తర్వాత కాంగ్రెస్‌ కవచం ఎలాగూ లభిస్తుందని జగన్‌కు కేసీఆర్‌ చెప్పి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయనే తన శిష్యుడు అఖిలేష్ కుమార్‌ యాదవ్‌ని ఢిల్లీలో ధర్నా చేస్తున్న జగన్‌ వద్దకు పంపించి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also Read – ఇక దువ్వాడ జీవితం మాధుర్యమే

అఖిలేష్ కుమార్‌ ఇండియా కూటమిలోనే ఉన్నారు. కనుక ఆయన సోనియా, రాహుల్ గాంధీలతో రాయబారం చేసి ఒప్పించి కాంగ్రెస్‌లో వైసీపి విలీనానికి ఒప్పించవచ్చని ఆ గుసగుసల సారాంశం.

కాంగ్రెస్‌తో రాయబారం కోసమే దాంతో మంచి పరిచయాలున్న బొత్స సత్యనారాయణ సత్యనారాయణని వెంటబెట్టుకొని జగన్‌ ఢిల్లీ వెళ్ళారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కనుక బొత్స సత్యనారాయణ లేదా అఖిలేష్ యాదవ్‌ ఇద్దరిలో ఎవరో ఒకరు కాంగ్రెస్‌తో జగన్‌కు తప్పక సెట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించినందున ధర్నా చేశారని ముందే ఓ సాకు సిద్దం చేసుకునే ఢిల్లీకి వెళ్ళారు కనుక ఈ ప్రయత్నాలు ఏవీ ఫలించకపోయినా తమ ధర్నా విజయవంతమైందని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో ధర్నా చేసి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగవుతాయో లేదో కానీ జగన్‌-కాంగ్రెస్‌, జగన్‌-బీజేపీల మద్య ఏదైనా జరిగే అవకాశం మాత్రం ఉండవచ్చు.