ఆ హీరో దేశభక్తికి ఫిదా అయిన కేంద్రమంత్రి!

Akshay Kumar donates Rs 1.08 crore to CRPF martyrs familiesమనకు డబ్బు, హోదా, పరపతిని ఇచ్చిన సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలనే మంచి మనసు అతి తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారిలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఒకడు. ఛత్తీస్ గఢ్ లోని సుక్మా ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన 12 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్ల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 9 లక్షల వంతున అక్షయ్ అందజేశాడు. దీంతో అక్షయ్ దాతృత్వాన్ని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.

ADVERTISEMENT

దీనిపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా అక్షయ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అక్షయ్ చేసిన సాయం అమర జవాన్ల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని, ప్రాణ త్యాగం చేసిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం ద్వారా అక్షయ్ ఎంతో మందికి ప్రేరణగా నిలిచారని కొనియాడారు. దేశంపై అక్షయ్ కు ఉన్న ప్రేమాభిమానాలను ఈ ఉదంతం వెల్లడిస్తోందదని చెప్పారు. మార్చి 11న మావోలు జరిపిన మెరుపు దాడిలో 12 మంది సీఆర్ఫీపీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

ADVERTISEMENT
Latest Stories