Thandel

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ఈ నెల 7న విడుదలవుతోంది. సినీ నిర్మాణ సంస్థ అభ్యర్ధన మేరకు ఏపీ ప్రభుత్వం తొలివారం రోజులపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీ ప్లెక్స్ థియేటర్లలో రూ.75 చొప్పున టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది.

కానీ తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఖరి స్పష్టం చేసేశారు. పైగా తెలంగాణ హైకోర్టు కూడా టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు, అదనపు షోలు అనుమతించవద్దని చెప్పేసింది.

Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?

కనుక తండేల్ సినీ నిర్మాణ సంస్థ ఆ ప్రభుత్వాన్ని అభ్యర్ధించలేదు. తండేల్‌ని భారీ బడ్జెట్‌తో 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించినప్పటికీ, ఎటువంటి హడావుడీ లేకుండా మొన్న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించుకోవలసి రావడం గమనిస్తే, రేవంత్ రెడ్డి చెప్పిన్నట్లు తాను సిఎం కుర్చీలో కూర్చొని ఉన్నంత కాలం తెలంగాణలో తెలుగు సినిమాల పరిస్థితి ఈవిదంగానే ఉండబోతోందని భావించవచ్చు.

త్వరలో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నితిన్ రాబిన్ హుడ్, చిరంజీవి-‘విశ్వంభర’, ప్రభాస్‌-‘రాజాసాబ్’, పవన్ కళ్యాణ్‌-‘హరిహర వీరమల్లు’ విడుదలవుతాయి.

Also Read – కర్నూలు హైకోర్టు బెంచ్‌కి తొలి విగ్నం.. వాళ్ళేనా?

వాటి తర్వాత రాబోయే రెండు మూడేళ్ళలో ఫౌజీ, స్పిరిట్, సలార్-2, కల్కి-2, దేవర-2, ఎస్ఎస్ఎంబీ29( రాజమౌళి-మహేష్ బాబు సినిమా) వంటి అనేక భారీ బడ్జెట్‌ సినిమాలు వరుసగా విడుదలవుతాయి.

ఇవి కాక విజయ్ దేవరకొండ, నాని, రవితేజ, నితిన్, విశ్వక్‌ సేన్‌, జొన్నలగడ్డ సిద్ధూ, కిరణ్ అబ్బవరం, రామ్ పోతినేని వంటి హీరోల సినిమాలు వస్తూనే ఉంటాయి.

Also Read – చెప్పేవి శ్రీరంగ నీతులు…చేసేవి వైసీపీ రాజకీయాలా.?

కానీ ఇప్పుడు ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసినా తెలంగాణలో మాత్రం మామూలు సినిమాలుగానే ఆడించుకోవలసి ఉంటుంది. ఆ సినిమాల ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సినీ పరిశ్రమకి ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది.




ఇంతకాలం టీజర్‌, ట్రైలర్‌, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు, బెనిఫిట్ షోలతో కళకళలాడిన హైదరాబాద్‌లో తెలుగు సినీ పరిశ్రమకు ఇటువంటి దుస్థితి ఏర్పడటం బాధాకరమే కదా?