
ఒకవేళ కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగితే అందుకు ఎవరైనా బాధ పడతారు. కానీ వైసీపీ మాత్రం సంతోషిస్తున్నట్లుంది. చంద్రబాబు నాయుడు మీదే మోడీ ప్రభుత్వం ఆధారపడి నడుస్తోందని టీడీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ బడ్జెట్‌లో రాష్ట్రానికి ఒక్క రూపాయి ఇవ్వలేదని వైసీపీ నేతలు అప్పుడే మొదలెట్టేశారు. టీడీపీకి 21 మంది ఎంపీలు ఉండి ఏం ప్రయోజనం ఒక్క రూపాయి, ఒక్క ప్రాజెక్ట్ సాధించలేకపోయారంటూ విమర్శలు మొదలుపెట్టేశారు.
ఏపీకి కేంద్రం నిధులు ఇవ్వకపోతే దాన్ని విమర్శించాలి.. నిలదీయాలి. కానీ ప్రధాని మోడీకి ఆగ్రహం తెప్పిస్తే ప్రమాదం కనుక ఈ వంకతో సిఎం చంద్రబాబు నాయుడుపై అప్పుడే వైసీపీ నేతలు, వారి సొంత మీడియా కూడా విమర్శలు మొదలుపెట్టేశారు.
Also Read – అయ్యో పాపం ఆమాద్మీ… ఇలా కూడానా?
సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శించాలనే తాపత్రయంలో అసలు బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు జరిగాయా లేవా?అని చూసుకున్నట్లు లేదు. ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి కేటాయించిన నిధుల వివరాలు:
· పోలవరం ప్రాజెక్టుకి రూ. 5,936 కోట్లు
Also Read – చంద్రబాబు దూరదృష్టి వలన ఏపీ సేఫ్!
· వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి రూ. 3,295 కోట్లు
· విశాఖ పోర్టుకి రూ. 730 కోట్లు
Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?
· రాష్ట్రంలో రోడ్లు, వంతెనల నిర్మాణానికి రూ. 240 కోట్లు
· ఏపీ సాగునీటి పారుదల, వాటి ద్వారా జీవనోపాధి పెంచేందుకు ప్రాజెక్ట్ (రెండో దశ) కోసం రూ. 242.50 కోట్లు
· సేంద్రీయ వ్యవసాయం కోసం రూ.186 కోట్లు
· నైపుణ్యాభివృద్ధి కోసం రూ.375 కోట్లు.
· రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థలని బలోపేతం చేసేందుకు రూ.162 కోట్లు కేటాయిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
ఇవి కాక ఇప్పటికే మంజూరు చేసిన ప్రాజెక్టులు, నిధులు:
అనకాపల్లి జిల్లా, పూడిమడకలో రూ.1.85 లక్షల కోట్ల పెట్టుబడితో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు చేయబోతోంది.
రూ.111 కోట్లతో విశాఖపట్నంలో రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మించబోతోంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో రూ.1,876 కోట్లు వ్యయంతో రెండు వేల ఎకరాలలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయబోతోంది.
ఏపీలో వివిద జిల్లాలో రూ.4,593 కోట్లు వ్యయంతో జాతీయ రహదారి ఎన్‌హెచ్-516తో సహా 2,4, వరుసల రోడ్ల నిర్మాణం, విస్తరణ పనులు.
గుంటూరు-తెలంగాణలో బీబీ నగర్, డోన్-మహబూబ్ నగర్, ఏపీలో వివిద ప్రాంతాలలో రైల్వే ప్రాజెక్టులు రూ.6,336 కోట్లు.
రూ. 2,139 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లాలో కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీ (క్రిస్ సిటీ) ఏర్పాటు.
వీటన్నిటికీ గత నెలలో ప్రధాని మోడీ విశాఖకు వచ్చి శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే.