చాలా అరుదుగా మెగా – నందమూరి వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు ఒకే వేదికపై కనపడుతుంటారు. తాజాగా అలాంటి అవకాశం బోయపాటి శ్రీను సోదరుని తనయురాలి వివాహం సందర్భంగా కలిగింది. ఈ వేడుకకు హాజరైన నందమూరి నటసింహం బాలకృష్ణ నూతన వధూవరులను ఆశీర్వదించి, పక్కనే ఆశీనులు కాగా, మరికొద్దిసేపటికి అక్కడికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చేరుకున్నారు.
కొత్త జంటను ఆశీర్వదించిన అనంతరం, అల్లు అరవింద్ వెళ్లి బాలకృష్ణ పక్కనే కూర్చున్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకరికొకరు చూసుకుంటూ ఉండగా, క్లిక్ మనిపించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఏర్పడిన పరిణామాల నేపధ్యంలో… మెగా కాంపౌండ్ వేదికగా టిడిపికి వ్యతిరేక పవనాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో… వీరిద్దరూ ఇలా కూర్చోవడం… ఒకరికొకరు చూసుకోవడం… వైరల్ గా మారింది.
ADVERTISEMENT
ADVERTISEMENT



