అమరావతి-బెంగళూరు రైల్, రోడ్ కనెక్ట్ ఇలా…

Amaravati Bengaluru Connectivity

విజయవాడ-బెంగళూరు నగరాలను కలుపుతూ రూ.19,320 కోట్లు పెట్టుబడితో 624 కిమీ పొడవైన, విశాలమైన ఆరు లేన్లతో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. భారత్‌మాల పరియోజన ఫేస్-2లో భాగంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న ఈ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-544జి) పూర్తయి అందుబాటులోకి వస్తే విజయవాడ నుంచి కేవలం 7 గంటలలో బెంగళూరు చేరుకోవచ్చు.

ఇది కాక అమరావతి-బెంగలూరు మద్య హైస్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. రూ.1.90 లక్షల కోట్లు వ్యయంతో 864 కిమీ పొడవున నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ ఇంజనీరింగ్ సర్వేలు పూర్తయ్యాయి.

ADVERTISEMENT

దీని డీపిఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) కూడా సిద్ధమైంది. ప్రస్తుతం ఇది కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉంది. గంటకు 300-350కిమీ వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైళ్ళ కోసం ఈ రైల్వే కారిడార్ నిర్మించబోతున్నారు.

ఓ పక్క అమరావతి నిర్మాణ పనులు జోరుగా సాగుతుంటే, ఏపీ రాజధానిని ఇరుగు పొరుగు రాష్ట్రాలతో అనుసంధానం చేస్తూ ఇలాంటి భారీ రైల్, రోడ్ ప్రాజెక్టు పనులు కూడా సమాంతరంగా సాగుతున్నాయి.

కనుక రాబోయే మూడు నాలుగేళ్ళలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయి అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, రవాణా, ఐటి, వాణిజ్య తదితర రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ చిత్రం సమూలంగా మారిపోతుంది.

ADVERTISEMENT
Latest Stories