chandrababu-naidu-amaravati-development

ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా రాజధాని కీలకం… గర్వకారణం. అందుకే సమైక్య రాష్ట్రాన్ని పాలించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా ముఖ్యమంత్రులు అందరూ హైదరాబాద్‌ని పోటాపోటీగా అభివృద్ధి చేశారు. జగన్‌కి కూడా బాగా తెలుసు.

కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి గర్వకారణంగా నిర్మించాల్సిన అమరావతిని పాడుబెట్టేశారు. ఒకవేళ తాను అధికారం కోల్పోయినా ఎట్టి పరిస్థితులలో ఎవరూ అమరావతి నిర్మించకుండా చేయకూడని పనులన్నీ చేశారు కూడా.

Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!

కానీ అమరావతికి పునాది వేసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రికాగానే మొట్ట మొదట అమరావతిపైనే దృష్టి సారించారు. రాష్ట్ర విభజన కారణంగా అప్పుడూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వ లేదు. జగన్‌ చేసిన అప్పుల కారణంగా ఇప్పుడూ ప్రభుత్వం చేతిలో చిల్లిగవ్వ లేదు. అంటే అప్పుడూ, ఇప్పుడూ ఒకే పరిస్థితి నెలకొని ఉందన్న మాట!

కానీ సిఎం చంద్రబాబు నాయుడు పట్టువదలని విక్రమార్కుడు వంటివారు. కనుక ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.15000 కోట్లు, హడ్కో నుంచి మరో రూ.11,000 కోట్లు దీర్గకాళిక రుణాలు సాధించి అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!

చేతిలో డబ్బు, రాజధాని నిర్మించుకోవాలనే బలమైన సంకల్పం, కేంద్రం సహాయసహకారాలు ఉన్నందున చకచకా పనులు జరుగుతున్నాయి.

ఇప్పటికే రూ.40,000 కోట్లు విలువైన 62 పనులకు టెండర్లు దాఖలయ్యాయి. మరో 11 పనులకు త్వరలోనే టెండర్లు పిలువబోతున్నారు.

Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఎత్తేయగానే టెండర్లు ఖరారు చేస్తారు. మార్చి 15 నుంచి నిర్మాణ సంస్థలు తమ యంత్రాలు, కార్మికులు, ఇంజనీర్లను అమరావతిలో దించబోతున్నాయి.

ఏప్రిల్ మొదటి వారంకల్లా అమరావతిలో వివిద సంస్థలకు చెందిన 30,000 మంది ఇంజనీర్లు, సూపర్ వైజర్లు, కార్మికులు పనులు చేస్తుంటారని మంత్రి నారాయణ తెలిపారు.

2027 డిసెంబర్‌లోగా అమరావతిలో వీలైనన్ని నిర్మాణ పనులు పూర్తిచేసి అందుబాటులోకి తెస్తామని వాటితో రాజధానికి రూపురేఖలు వస్తాయమని మంత్రి నారాయణ చెప్పారు.

ఇప్పుడు రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఉంది. కేంద్రంలో సిఎం చంద్రబాబు నాయుడు కీలకంగా ఉన్నారు. ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్‌కి మంచి సఖ్యత ఉంది. కేంద్రం ఏపీకి సహాయ సహకారాలు అందిస్తోంది.

ముఖ్యంగా అమరావతిని వ్యతిరేకస్తున్న జగన్‌, కేసీఆర్‌ ఇద్దరూ రాజకీయంగా చాలా బలహీనంగా ఉన్నారు. కనుక అమరావతి నిర్మాణ పనులకు ఇక ఎటువంటి ఆటంకమూ లేన్నట్లే!