
ఏపీకి రాజధాని లేకుండానే జగన్ ఐదేళ్ళు రాష్ట్రాన్ని పాలించేశారు. రాజధాని లేకపోయినందుకు ప్రజలు సిగ్గు పడ్డారు కానీ జగన్ సిగ్గు పడలేదు. అందుకే ప్రజలు ఆయనని దించేసి అమరావతి నిర్మిస్తానని చెప్పిన సిఎం చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేశారు.
హైదరాబాద్‌కి ఐటి కంపెనీలను రప్పించి మంచి పేరు తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు, అమరావతిని అంతకంటే అద్భుతంగా నిర్మించి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తనకంటూ ఓ శాశ్విత స్థానం ఏర్పరచుకోవాలనుకున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రి కాగానే వెంటనే అమరావతిపై దృష్టి సారించారు. ఈ సారి ఎన్డీఏ (కేంద్రం) ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా మారడం కూడా ఆయన చక్కగా వినియోగించుకుంటూ ఏపీకి భారీగా నిధులు, ప్రాజెక్టులు సాధించుకుంటున్నారు.
Also Read – సిఎం కంటే మంత్రులకే మంచి ర్యాంక్స్… భళా!
కానీ అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందించే బదులు అవుటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్, అమరావతిని ఇతర రాష్ట్రాలు, నగరాలను కలుపుతూ రోడ్లు, రైల్వే లైన్లకు నిధులు కేటాయిస్తోంది. వాటికే వేలకోట్లు కేటాయిస్తున్నందున, అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.15,000 కోట్లు, హడ్కో నుంచి మరో రూ.11,000 కోట్లు కలిపి మొత్తం రూ.26,000 కోట్లు తక్కువ వడ్డీతో దీర్గకాలిక రుణాలు ఇప్పించింది. ఈ రెండు ఋణాలకు కేంద్రం గ్యారెంటర్‌గా ఉంది.
ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే రుణం మంజూరు చేయగా, తాజాగా హడ్కో కూడా రుణం మంజూరు చేసింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ముంబయి వెళ్ళి హడ్కో ప్రతినిధులతో సమావేశమైన తర్వాత రుణం మంజూరుకు హడ్కో బోర్డు ఆమోదం తెలిపిందని చెప్పారు.
Also Read – జగన్ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?
ఇప్పటికే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. ఐకానిక్ టవర్స్ పునాదుల చుట్టూ పేరుకుపోయిన నీటిని మోటర్లతో తోడి బయటపోస్తుంటే, ఆ నీటిలో పెరిగిన పెద్దపెద్ద చేపలు పట్టుకునేందుకు చుట్టుపక్కల ప్రజలు తరలివస్తున్నారు. అమరావతిని పాడుబెట్టేసిన జగన్, ప్రజలకు చేసిన మేలు ఇదొక్కటేనేమో?
అమరావతి నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు పిలిచింది. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో రూ.26,000 కోట్లు సిద్దంగా ఉన్నాయి కూడా. కనుక ఫిబ్రవరి నెలాఖరు నుంచి లేదా మార్చి మొదటివారం నుంచి అమరావతి నిర్మాణ పనులు జోరుగా ప్రారంభం కాబోతున్నాయి.
Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?
పాపం జగన్.. అమరావతిని నాశనం చేయాలని ఎంత ప్రయత్నించినా, ఆయన కళ్లెదుటే అమరావతి నిర్మాణం జరుగబోతోంది. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో?