
2015 అక్టోబర్ 22 విజయదశమి నాడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పునాది రాయి పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి గత ఐదేళ్లు అజ్ఞాతంలోనే తన పోరాటాన్ని కొనసాగిస్తూ వచ్చింది.
అమరావతి అంకురార్పణకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబూ ఆశలను, ఆశయాలను ఏపీ ప్రజలకు దూరం చేయడమే వైసీపీ రాజకీయం అన్నట్టుగా గత ఐదేళ్లు వైస్ జగన్ అమరావతి మీద విషం చిమ్ముతూ, రాజధాని అనే పదానికి సమాధి కట్టారు, రాష్ట్ర భవిష్యత్ కి ఆయువు తీశారు.
Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?
దీనితో ఏపీ భవిష్యత్ గాల్లో దీపం మాదిరి రెపరెపలాడుతూ ఒక చేయూత కోసం ఆశగా ఎదురు చూసింది, చివరికి కూటమి రూపంలో ఆ చేయూతను అందిపుచ్చుకుంది. ఇక ఇక్కడితో అమరావతి కష్టాలు భోగి మంటలలో వేసిన పాత సామాను మాదిరి కాలిపోయి రాష్ట్రానికి కొత్త వెలుగులు తీసుకురావాలని అటు ప్రభుత్వ పెద్దలు నిరంతరం శ్రమిస్తున్నారు.
అలాగే ఇటు సామాన్య ప్రజానీకం కూడా ఆ రాజధాని వెలుగు జిలుగులను వీక్షించడానికి, ఆస్వాదించడానికి వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సంక్రాంతి వేడుకల తరువాత అమరావతి అభివృద్ధి పనులు షరా వేగంతో పట్టాలెక్కపోతున్నట్టు కూటమి పెద్దలు ప్రకటించారు. ముంపు ప్రాంతమంటు ప్రచారం చేస్తూ అమరావతి అభివృద్ధిని ముంచేసిన వైసీపీ ఇప్పుడు అదే అమరావతి అభివృద్ధిని కళ్లారా చూడబోతుంది.
Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?
జంగిల్ క్లియరెన్స్ తో మొదలైన అమరావతి అభివృద్ధి పనులు అమరావతి ఓటర్ రింగ్ రోడ్ నిర్మాణాలతో వేగం పెంచనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుండి ఈ అభివృద్ధి పనులకు సంబందించిన అనుమతులు, ఒప్పందాలు ఆఖరి దశకు చేరినట్టు సమాచారం. అలాగే రాజధాని నిర్మాణాలకు గాను ప్రపంచ బ్యాంకు ఎడిబి రుణాలు మంజూరు చేయడం అమరావతికి పూర్వవైభవం తేనుంది.
గత టీడీపీ హయాంలో మధ్యలో ఆగిపోయిన అమరావతి నిర్మాణాలను పునర్ ప్రారంభించి వాటిని అందుబాటులోకి తీసుకురావడానికి దాదాపు 2791 కోట్ల విలువైన పనులకు గాను ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. వాటిలో రెండు పాలవాగు, గ్రావిటీ కాలువల పనులు కాగా మరికొన్ని రాజధానికి వివిధ ప్రాంతాల నుండి రోడ్ల నిర్మాణాలు చేపట్టడం. అలాగే వాటితో పాటు మరికొన్ని కొత్త నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమయ్యింది.
2027 నాటికి రాజధాని అమరావతి కి ఒక నిర్దిష్టమైన రూపం తీసుకువచ్చి పారిశ్రామికంగా రాష్ట్రాన్ని పటిష్టం చేసి అభివృద్ధి బాటలోకి తీసుకురావడానికి తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని రంగరిస్తున్నారు బాబు. దీనితో ఇన్నాళ్ల అమరావతి అజ్ఞాత కష్టాలు, రాజధాని రైతుల పోరాట దీక్షలు భోగి మంటలలో కాలి బూడిదయినట్టే అంటున్నారు ఏపీ వాసులు.