అమరావతి పై జగన్ కొత్త కథ రాయాల్సిందేనా.?

Amaravati Future Hinges on Political Clarity in AP

వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే, వైస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితే అన్న ఆలోచనే ఏపీ భవిష్యత్ కు అవరోధంగా, రాష్ట్ర రాజధాని అమరావతికి అడ్డంకిగా మారిపోతుంది.

ఒక్క ఛాన్స్ అడగటానికి ముందు రాజధానిగా అమరావతికి జై కొట్టిన జగన్ ఆ ఒక్క ఛాన్స్ తో మూడు రాజధానులంటూ అమరావతిని కోలుకోలేని దెబ్బకొట్టారు. నాడు నా ఇల్లు ఇక్కడే రాష్ట్ర రాజధాని ఇక్కడే అంటూ ప్రజలను నమ్మించిన జగన్ నేడు సాక్షిలో అమరావతి పై జరుగుతున్న విష ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారు.

ADVERTISEMENT

గత ఐదేళ్లు అమరావతి పై వైసీపీ చేసిన రాజకీయం జగన్ ఆడిన మూడుముక్కలాట తో శిథిలావస్థకు వెళ్లిన అమరావతి కూటమి రాకతో కొత్త కళను సంతరించుకుని సుమారు 80 వేల కోట్ల టెండర్ల పనులతో రాజధానిగా రూపుదిద్దుకుంటుంది.

ఇటువంటి తరుణంలో అమరావతి వరద ముంపు ప్రాంతమంతా వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలు, సాక్షి నుండి నీలి మీడియా సహా ప్రసారం చేస్తున్న విష కథనాలు, అమరావతిలో పులస అంటూ ఒకరు, SRM యూనివర్సిటీ వద్ద చేపల వేట అంటూ మరొకరు రాజధాని పై రాజీ లేని రాజకీయం నడుపుతూ రాష్ట్ర భవిష్యత్ ను వరద కి బురద కి మధ్య నలిపేస్తున్నారు.

అమరావతి అనేది చంద్రబాబు నిర్మిస్తున్న రాజధాని. హైద్రాబాద్ కి బ్రాండ్గింగ్ గా మారిన నాటి హైటెక్ సిటీ ఇప్పటికి బాబు విజనరీని ప్రపంచానికి చూపిస్తూనే ఉంది. తెలంగాణలో ప్రభుత్వాలు మారినా, పార్టీ నాయకులు వేరయినా అందరు ఏకకంఠంతో హైద్రాబాద్ అభివృద్ధికి బాబు వేసిన పునాది ని క్ర్తిస్తూనే వస్తున్నారు, చరిత్ర ఆయన విజనరీని నేటి తరానికి చూపిస్తూనే వెళ్తుంది.

అలాంటిది ఏపీలో అమరావతి అంటూ నవ నగరాల నిర్మాణం చేపట్టిన బాబు చరిత్ర జగన్ కూడా చేరలేనిదిగా మారుతుంది, ఆ అభివృద్దిని వైసీపీ కూడా ఒప్పుకుని తీరక తప్పదు. అలాగే సాక్షి సైతం అమరావతి నిర్మాణాలను ప్రసారం చేయక తప్పదు. ఆ ఆలోచనే వైస్ జగన్ ను ఊరికే ఉండనివ్వడం లేదు.

అందుకు కోసమే కనీసం డ్రైనేజి వ్యవస్థ కూడా సరిగా లేని రాజధాని ప్రాంతం పై వరద విషం చిమ్ముతున్నారు. అదే కారణాన్ని బూచిగా చూపిస్తూ ఇన్నాళ్లు వైసీపీ చేసిన రాజకీయం ఇక్కడితో కూడా ఆగేలా కనిపించడం లేదు. ఒకపక్క 2028 నాటి లక్ష్యంగా రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ జగన్ ఇప్పటికి అమరావతి పై ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని వెలుబుచ్చడం లేదు.

2029 నాటికీ అమరావతిని రాష్ట్ర రాజధానిగా స్థిరపరచడానికి బాబు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నా రేపటి రోజున వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ఇన్ని వేలకోట్లు ఖర్చు చేసి చేసిన అభివృద్ధి పనులను జగన్ పక్కన పెట్టేస్త్రా.? అమరావతిని కాదని వైసీపీ ని వద్దనుకున్న విశాఖకు జగన్ తిరిగి వెళ్తారా.?

అమరావతి ప్రాంత ప్రజల మనోభావాలకు వైసీపీ లో విలువలేదు. అలాగే ఇక్కడి నియోజకవర్గాల వైసీపీ నాయకుల గెలుపు పై వైసీపీ కి ఆశ లేదు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో కూటమి తో వైసీపీ కలబడడానికి అమరావతి పై మరో కొత్త కథను సిద్ధం చేస్తుందా.? లేక ఉన్న వరద బురదకే పరిమితమవుతుందా.?

ఏదిఏమైనా రాజధాని పై స్పష్టత లేని వైసీపీ రాజకీయం, అమరావతి పై నిలకడ లేని జగన్ ప్రకటనలు, రాజధాని పై సాక్షిలో తగ్గని నీలి రాతలు అన్ని కలగలిపి 2024 నాటి ఫలితాలే వైసీపీ ని మరో ఛాన్స్ అడిగే అవకాశం ఉంటుందా.?

ADVERTISEMENT
Latest Stories