అనంతపురం – అమరావతి రోడ్డు మార్గం స్పెషల్!

Amaravati to Anantapur National High Wayఏపీలో అభివృద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో మౌలిక వసతుల సదుపాయాల విషయంలో దృష్టి కేంద్రీకరించిన చంద్రబాబు, నేషనల్ హైవేల 2018 నాటికల్లా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఇందులో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా కాంట్రాక్టర్ లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరికలు కూడా జారీ చేసారు. ఇందులోనూ అమరావతి నుండి అనంతపురం వెళ్ళే ఎక్స్ ప్రెస్ వేను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

దాదాపుగా 393.59 కిలోమీటర్ల పొడవుతో నిర్మిస్తున్న అమరావతి – అనంతపురం ఎక్స్‌ ప్రెస్ వే దేశంలోనే మూడో అతిపెద్ద జాతీయ రహదారి కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆర్ అండ్ బీ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మాట్లాడిన చంద్రబాబు… 393.59 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ రహదారిలో 185.4 కిలోమీటర్లలో మేర నాలుగు వరుసలు, 208.19 కిలోమీటర్ల పొడవులో ఆరు వరుసలుగా నిర్మించనున్నట్టు తెలిపారు.

ADVERTISEMENT

అలాగే విజయవాడ – మచిలీపట్నం మధ్య 64.6 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్న 9వ జాతీయ రహదారి ప్రాజెక్టుకు 740.70 కోట్లు ఖర్చవుతుందని, విజయవాడ బెంజిసర్కిల్ వద్ద 618 మీటర్ల పొడవుతో నిర్మించనున్న ఫ్లైఓవర్‌కు సంబంధించి డిజైన్లు సిద్ధమయ్యాయని, భోగాపురం-భీమిలి, విశాఖపట్టణం-భీమిలి మధ్య నిర్మించనున్న బీచ్ రహదారులతో జాతీయ రహదారులను కలపడం ద్వారా “సౌందర్యమాల” ప్రాజెక్టు సాకారం అవుతుందని ముఖ్యమంత్రి తెలిపారు.

ADVERTISEMENT
Latest Stories