Ambati Murali is Afraid of Illegal Demolitions

పర్యావరణ అనుమతులు లేవని, ఇది అక్రమ కట్టడం అంటూ ‘ప్రజా వేదిక’ కూల్చివేతలో పాలన మొదలు పెట్టిన వైసీపీ…తన హయాంలో ఎన్ని ఆక్రమణలకు పాల్పడిందో, ఎన్ని నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు తుంగలో తొక్కిందో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

సజ్జల అటవీ భూముల ఆక్రమణలు, సాయి రెడ్డి విశాఖ భూ దండాలు, పెద్ది రెడ్డి భూ కబ్జాలు ఇలా వైసీపీ ముఖ్య నేతలుగా చెప్పుకునే బడా నాయకులంతా కూడా గత ఐదేళ్లు ప్రకృతి సంపదను హరించేసారు, ప్రజా వనరులను అన్యాక్రాంతం చేసారు. బడా నాయకులు వారి వారి స్థాయి దందాలతో అక్రమాలకు పాల్పడితే ఇక మిగిలిన చోటా మోటా నేతలు వారి పరిధిని పెంచుకున్నారు.

Also Read – అయ్యో! మన హిస్టరీ అంతా అలా చెప్పేస్తున్నారేమిటి?

ఇందులో భాగంగా మాజీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు వైసీపీ నేత అంబటి మురళి తన స్థాయికి మించిన అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన నేతృత్వంలో నిర్మించబడుతున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ నేడు వివాదంలో చిక్కుకుంది. ఆ నిర్మాణాలకు పర్యావరణ అనుమతులు లేవని ఫిబ్రవరి 27 న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉతర్వులు జారీ చేసింది.

ఇదిలా ఉంటే జనవరి 9 న ఈ నిర్మాణాలను పరిశీలించిన రాష్ట్ర పీసీబీ అధికారులు ఈ నిర్మాణానికి తమ అనుమతులు లేవని, ఇక్కడితో ఈ నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ ఆదేశించింది. నిర్మాణానికి అవసరమైన అనుమతులు లేకుండా కట్టడాలు చేపడుతున్న నిర్మాణ సంస్థ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ప్రభుత్వానికి సిఫారస్ చేసారు.

Also Read – వైసీపీ ఇప్పుడే ధర్నాలు చేసుకుంటే మంచిదేమో?

ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఈ ఆదేశాలను పాటించకుండా సదరు నిర్మాణ సంస్థ ఈ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ను నివాసానికి అనువుగా నిర్మించి సదరు యజమానికి అప్పగించింది. దీనితో అక్కడ జరిగిన గృహ ప్రవేశంతో అధికారులు ఒక్కసారిగా ఎలెర్ట్ అయ్యారు.

ప్రభుత్వ అధికారుల హెచ్చరికలను భేఖాతరు చేసిన అంబటి మురళి వ్యవహారం పై అధికారులు సీరియస్ అయ్యారు. దీనిని ప్రభుత్వ ఉల్లంఘన చర్యగా భావించిన అధికారులు గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ యాజమాన్యం మీద చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నారు. అలాగే ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మించిన ఈ భవనాల పరిస్థితి పై కూడా ప్రభుత్వం ఆరా తీయనుంది.

Also Read – బెట్టింగ్ రాజాలు…సిద్ధమా.?

దీనితో గత ఐదేళ్లు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టా రీతిగా వ్యవహరించిన అంబటి మురళి కి ఇప్పుడు కూల్చివేతల భయం పట్టుకుంది. అయితే ఇప్పటికే ఈ అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ రూపంలో సగానికి పైగా అమ్మకాలు పూర్తి అయినట్టు సమాచారం. పర్యావరణ అనుమతులు లేకుండా, అక్రమంగా నిర్మించిన ఈ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ ను కూడా ప్రభుత్వం కూల్చివేస్తుంది అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి.




ఈ నేపథ్యంలో అంబటి పాపానికి అందులో ఫ్లాట్స్ కొని ఇన్వెస్ట్ చేసిన యజమానులు లబోదిమో మంటూ తలలు పట్టుకుంటున్నారు. మరి సినిమాల రివ్యూలా మీద, నాట్య ప్రదర్శనల మీద పెట్టే శ్రద్ద కాస్త అంబటి తన సోదరుడి నిర్మాణాల మీద పెట్టి ఉంటే ఇప్పుడీ పరిస్థితి ఎదురయ్యేది కాదు, అలాగే అధికారులు ఈ రివ్యూ మీటింగ్స్ నిర్వహించాల్సిన అగత్యం కూడా వచ్చి ఉండేది కాదేమో అంటూ అంబటి పై కూడా చురకలు పడుతున్నాయి.