Mudragada Padmanabham Ambati Rambabu

మాజీ మంత్రి అంబటి రాంబాబు బుధవారం కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటికి వెళ్ళి పేరు మార్చుకునందుకు అభినందనలు తెలియజేశారు. ఎన్నికలలో చేసిన సవాలుకి కట్టుబడి ఆయన పేరు మార్చుకున్నప్పటికీ ఆయన ఎప్పటికీ కాపు సామాజికవర్గానికే చెందుతారన్నారు.

కాపుల సంక్షేమం కోసం ఆయన తన జీవితాన్నే త్యాగం చేశారని అంబటి రాంబాబు అన్నారు. కాపు ఉద్యమాలు చేసినా ఆయన రాజకీయాలలో కులాన్ని ఎన్నడూ వాడుకోలేదన్నారు. కాపుల కోసం చేసిన పోరాటాల వలన ఆయన చాలా నష్టపోయారన్నారు.

Also Read – బనకచర్ల పేరుతో కాంగ్రెస్‌, బిఆర్ఎస్ యుద్ధాలు.. ఏపీకి తలనొప్పులు!

ముద్రగడ పద్మనాభ రెడ్డి కాపు రిజర్వేషన్ల కోసం చేసిన పోరాటాల వలననే ఇంత గుర్తింపు పొందారు. ఆయన రాష్ట్రంలోని కాపుల ఓట్లను గంపగుత్తగా వైసీపికి వేయించి ఎన్నికలలో గెలిపిస్తారని, పిఠాపురంలో కాపుల ఓట్లు చీల్చి పవన్‌ కళ్యాణ్‌ని ఓడించి రాజకీయంగా చావుదెబ్బ తీస్తారనే జగన్‌ ఆయనను వైసీపిలో చేర్చుకున్నారు.

కనుక ముద్రగడ పద్మనాభ రెడ్డి కులం కారణంగానే జగన్‌ రాజకీయాలలో పావుగా మారి నవ్వులపాలయ్యారని అందరికీ తెలుసు. కనుక ఆయనకు అంబటి కాండక్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇచ్చినా ఆయన మూటగట్టుకున్న అపకీర్తి ఎన్నటికీ మాసిపోదు.

Also Read – రప్పా రప్పా నరుకుతాం.. అవునా.. తప్పేమిటి?

నిజానికి జగన్‌ పక్కన చేరడం వలననే ఆయనకు ఇంత అప్రదిష్ట, నవ్వులపాలయ్యారని చెప్పక తప్పదు. అదే ఆయన జనసేనలో పవన్‌ కళ్యాణ్‌కు అండగా నిలబడి ఉండి ఉంటే నేడు ఆయనకు ప్రభుత్వంలో, కాపు సమాజంలో కూడా ఎంతో గౌరవమర్యాదలు లభించేవి. బహుశః సముచిత పదవి కూడా లభించి ఉండేది. దాంతో చాలా హూందాగా రాజకీయజీవితం ముగించగలిగి ఉండేవారు.

కానీ అంతా పెద్ద మనిషి చెడు సావాసం వలన పరువు పోగొట్టుకున్నారని చెప్పక తప్పదు. ఇంత అప్రదిష్ట కలిగినా ఇంకా చెడు సావాసం వదులుకోకపోతే ఆయన ఇంకా నష్టపోవడం ఖాయం. జగన్, వైసీపి వలన ఆయనకు అప్రదిష్టే తప్ప గౌరవ ప్రతిష్టలు లభించవు.

Also Read – జగన్ రెచ్చిపోతున్నారు..పవన్ పత్తాలేరు.?


ఎన్నికలలో ఓటమి తర్వాత కూడా జగన్‌ ఆయనను ఇంకా దేనికో వాడుకోవాలని అనుకుంటున్నట్లు అంబటి రాయబారం సూచిస్తోంది. కనుక అంబటి రాంబాబు ఏ కారణంతో ఆయనను కలిసినప్పటికీ, ఇకనైనా ఆయన వైసీపికి దూరంగా ఉండటం చాలా మంచిది.