
ఇన్నాళ్లుగా లోకేష్ ను తమ మాటలతో, చేతలతో అవమానించిన వైసీపీ నేతలు ఇప్పుడు ప్రతి అంశంలోనూ లోకేష్ ను ఫాలో అవుతున్నారు. మొన్న లోకేష్ రెడ్ బుక్ ను ఆదర్శంగా తీసుకుని ‘గుడ్ బుక్’ ను సృష్టించారు వైసీపీ అధినేత వైస్ జగన్.
ఇక తమ పార్టీ కార్యకర్తల భుజం తట్టడానికి నేను ‘గ్రీన్ బుక్’ రాస్తున్నా అంటూ సెలవిచ్చారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీనితో వైసీపీ నేతలందరూ లోకేష్ రంగుల బుక్ ట్రాప్ లో పడ్డారా అనిపించింది. అయితే అప్పుడు రెడ్ కి గ్రీన్ ని కాపీ కొట్టిన అంబటి ఇప్పుడు మరో విషయంలో కూడా లోకేష్ నే అనుకరిస్తూ విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు.
Also Read – ఇవి కదా… సంస్కరణలంటే?
అయితే లోకేష్ గతంలో తన భాష ఉచ్ఛారణతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటు ప్రత్యర్థి పార్టీల నేతల నోటికి చిక్కేవారు, అలాగే కొన్ని వైసీపీ అనుబంధ మీడియాల కంటికి దొరికేవారు. దీనితో లోకేష్ వీడియోలను వైరల్ చేస్తూ ఆయన తెలుగు భాష ఉచ్చారణ మీద కూడా దిగజారుడు వ్యాఖ్యలు చేసేవారు వైసీపీ నేతలు.
అయితే 2024 ఎన్నికల నాటికీ వైసీపీ నుండి ఎదురైనా ప్రతి విమర్శకు తన చేతలతో బదులిచ్చారు లోకేష్. అందులో భాగంగానే నాడు మీడియా కనిపిస్తే తడబడే లోకేష్ నేడు మీడియా వారిని పిలిచి మరి చెప్పండి బ్రదర్, అడగండి బ్రదర్, ఇంకేమి లేవా.? అంటూ వారి పై ఎదురు ప్రశ్నలు సంధిస్తున్నారు.
Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..
ముఖ్యంగా లోకేష్ హాజరయ్యే ప్రెస్ మీట్లలో హే టీవీ 9 , N టీవీ, సాక్షి మీరు రాలేదామ్మా…. అంటూ వారి పేర్లను పిలుస్తూ, ఆయా మీడియాలకు సంబంధించిన మైక్ లను పట్టుకుని వారి పై సెటైర్లు వేస్తూ తనకు జరిగిన అవమానాలకు బదులు తీర్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో కూడా అంబటి లోకేష్ ను ఫాలో అవుతూ సోషల్ మీడియా కంటికి చిక్కారు.
వైసీపీ నేతల వరుస అరెస్టుల మీద స్పందిస్తూ మీడియా ముందుకొచ్చిన అంబటి ఏమయ్యా టీవీ 5 వచ్చిందా..ఆంధ్ర జ్యోతి వచ్చిందా…ఆ రెండు వస్తే చాలు అంటూ లోకేష్ మాదిరి మీడియా ప్రతినిధుల పై చమత్కారాలు జుప్పించారు అంబటి. దీనితో రాజకీయాలలో తల పండిపోయిన మీరు ఇప్పుడే రాజకీయాలను అవపోసన పడుతున్న లోకేష్ ను అనుకరిస్తున్నారా.? అంటూ అంబటి పై టీడీపీ శ్రేణులు మగ్గుమంటున్నారు.
Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?
అలాగే వైసీపీ పార్టీ తన పేరు నుంచి చేసే రాజకీయాల వరకు ఎప్పుడు ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకోవాల్సిందేనా, సొంతగా వైసీపీ నేతలకు ఎటువంటి ఆలోచనలు రావా.? అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే గతంలో లోకేష్ ని రాజకీయాలకు పనికి రాని పప్పు అంటూ అవమానించిన నేతలే ఇప్పుడు ‘ఐ వాన ఫాలో ఫాలో ఫాలో’…అంటూ లోకేష్ స్టైల్ రాజకీయాలను ఫాలో అవడం అది లోకేష్ సాధించిన విజయంగా పరిగణించవచ్చు.