వైకాపా నాయకుల వాదన విచిత్రంగా ఉంది. వంగవీటి రాధాకు అన్యాయం జరగదు అని చెబుతూనే ఆయన కోరుతున్న సీటు ఇవ్వడం కుదరదని చెప్పేస్తున్నారు. దివంగత నేత వంగవీటి రంగా అబిమానులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాలని, పార్టీలో వంగవీటి రాధాకృష్ణకు అన్యాయం జరగదని పార్టీ అధికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు.
[m9ad]
పార్టీలో క్రమశిక్షణ పాటించాలని, పార్టీ నాయకత్వం మాట వింటే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. విజయవాడ తూర్పు లేదా, మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గాలలో పోటీచేయవచ్చని పార్టీ సూచించిందని సమాచారం. బ్రాహ్మణులకు రెండు సీట్లు ఇవ్వాలని పార్టీ నిర్ణయించిందని, అందులో విజయవాడ సెంట్రల్ ఒకటని పార్టీ వర్గాలు చెబుతున్నాయి
వంగవీటి రాధాకు అన్యాయం చేయలనే ఆలోచన తమ పార్టీకి లేదన్నారు. మరోవైపు కార్యకర్తల సమావేశంలో వైసీపీ కోసం ఎంతో కష్టపడ్డా తనకు మాత్రం పార్టీ అన్యాయం చేసిందని వంగవీటి రాధా ఆవేదన వ్యక్తం చేశారు. ఐతే.. మూడు రోజులు ఓపిక పెట్టాలని వారికి రాధా సూచించారు.



