చేనేతకు చేసిందేమీ లేదు కానీ సీట్ల లెక్కలు పక్కా!

PawanKalyan-AmbatiRambabuజగన్ మంత్రివర్గం మొదటి బ్యాచ్‌లో కొడాలి నాని రోజూ మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌ను తిట్టిపోస్తూ అధినేతను ప్రసన్నం చేసుకోవాలని ఆరాటపడేవారు. అయినా మంత్రి పదవి ఊడింది. ఆయన స్థానంలో అంబటి రాంబాబు డ్యూటీ ఎక్కారు. మొన్న పవన్‌ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు.

ఎందుకంటే, ముందుగా ఓ విషయం గురించి చెప్పుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం, ఐ‌టి మంత్రి కేటీఆర్‌ తమ రాష్ట్రంలో చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు తోడ్పడేందుకు ఎంతగానో కృషి చేస్తుంటారు. ఆగస్ట్ 15న తెలంగాణ రాష్ట్రమంటా జెండాలు ఎగురవేసేందుకు రాష్ట్రంలోని చేనేత, పవర్‌లూమ్ కార్మికుల చేత ఒక కోటి 20 లక్షల జెండాలు తయారుచేయించడమే ఇందుకు తాజా ఉదాహరణ.

ADVERTISEMENT

అందరూ చేనేత దుస్తులు ధరించేలా ప్రోత్సహించేందుకు #మై హ్యాండ్‌లూమ్ మై ఫ్రైడ్ ఛాలెంజ్ పేరుతో ఆయన పవన్‌ కళ్యాణ్‌కు ఛాలెంజ్ చేయగా, పవన్‌ కళ్యాణ్‌ చేనేత దుస్తులు ధరించి మరో ముగ్గురు రాజకీయ నాయకులకి ఛాలెంజ్ చేశారు.

ఆ స్థాయిలో ఉన్న ప్రముఖులు, అదీ… పవన్‌ కళ్యాణ్‌ వంటి అగ్రనటుడు చేనేత దుస్తులు ధరించి అందరినీ ప్రోత్సహిస్తుంటే అందుకు ఆయనను అభినందించాలి. పవన్‌ కళ్యాణ్‌ స్పూర్తితో ఆయన అభిమానులు చేనేత దుస్తులు ధరిస్తున్నారు కూడా. రాష్ట్రంలో చేనేత కార్మికులను జగన్ ప్రభుత్వం పట్టించుకోకపోయినా పవన్‌ కళ్యాణ్‌ ఈవిదంగానైనా తోడ్పడుతున్నందుకు వారు కూడా చాలా సంతోషిస్తున్నారు.

కానీ ఇవన్నీ తెలియని మంత్రి అంబటి రాంబాబుకి పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశ్యించి, “ఎంతసేపు ఆ చేనేత బట్టల సవాళ్ళు విసురుకోవడమేనా… ఇకనైనా 175 సీట్లకు పోటీ చేస్తారో లేదో ప్రకటిస్తారా?” అంటూ వ్యంగ్యంగా విమర్శించారు.

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీకి 175 సీట్లు వస్తాయని భ్రమలో ఉంటూ ప్రజలను కూడా భ్రమింపజేయాలని ప్రయత్నిస్తోంది. అయినా ఇప్పుడే ఎన్నికలు రావడం లేదు కదా.. మరి ఓట్లు, సీట్లు అంటూ అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడుతున్నారు?అయినా 175 సీట్లు మీ పార్టీయే గెలుస్తుందని చెప్పుకొంటున్నప్పుడు జనసేనను చూసి భయపడటం దేనికి?” అంటూ ప్రశ్నిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories