రెచ్చ కొడుతున్న అంబటి…అదే కావాలంటున్న టీడీపీ.!

Ambati Rambabu

తెలంగాణ ఎన్నికల ఫలితాలతో వైసీపీ వర్గానికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. వైసీపీ నేతలు భావించినట్లు తెలంగాణలో ఇది జరగదు అని అనుకున్న కార్యాన్ని తెలంగాణ ప్రజలు దగ్గరుండి జరిపించారు.అదే బిఆర్ఎస్ ఓటమి. అలాగే వీరికి దక్కదు అనుకున్న ముఖ్యమంత్రి పదవిని దగ్గరుండి మరి చేస్తుంది పార్టీ అధిష్టానం.వారే రేవంత్ రెడ్డి.

ఊహించని రెండు పరిణామాలతో కంగు తిన్న వైసీపీ తన ఉక్రోషాన్ని ఆపుకోలేకపోతున్నట్టుంది. సొంత శాఖల మీద పట్టు సాధించలేక మేమేమన్నా జ్యోతిష్కులమా అన్న ఏపీ మంత్రులు పక్క పార్టీల జాతకాలు చెప్పడానికి మాత్రం జ్యోతిష్కుల అవతారం ఎత్తుతున్నారు.అదే అండి అంబటి గారు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని జలవనరుల శాఖ మంత్రి గారు భవిష్యత్తులో ఏ పార్టీ ఏపార్టీతో పొత్తులో వెళుతుందో, ఏ పార్టీ కార్యాలయం మీద ఏ పార్టీ జెండా ఎగురుతుందో తన దివ్య దృష్టితో ఇట్టే చెప్పేస్తున్నారు.

ADVERTISEMENT

అసలు విషయానికి వస్తే..,టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల మీద వైసీపీ కడుపుమంట అంతా రంగరించి తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు అంబటి. “జనసేన జెండా ఎన్టీఆర్ భవన్ కి..,టీడీపీ జెండా గాంధీ భవన్ కి. సిగ్గు, సారం లేనోళ్ళు”…అంటూ తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ విజయంపై వైసీపీ పార్టీ అక్కసు మొత్తం వెళ్లగక్కారు. ఏపీలో టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఒకరి పార్టీ జెండాలు మరో పార్టీ నేతలు మేడలో వేసుకుంటున్నారు.

అలాగే తెలంగాణలో టీడీపీ పార్టీ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండడంతో టీడీపీ పార్టీ సానుభూతి పరులు అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతు తెలిపి ఉండవచ్చు. అంత మాత్రాన గాంధీ భవన్ పై టీడీపీ జెండా, సిగ్గు ,సారం అంటూ చాల పెద్ద పెద్ద మాటలే వదిలారు అంబటి.ఇటువంటి విమర్శలు చేసి ఇటు టీడీపీ – జనసేన శ్రేణుల నుండి కౌంటర్లు ఎదుర్కుంటున్న అంబటి ఇక తెలంగాణ అధికార పార్టీ అయినా కాంగ్రెస్ రేవంత్ నుండి కూడా అంతే ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి వస్తుంది.

అంబటి ఇలా రెచ్చ గొట్టే విమర్శలు చేయడం ద్వారా అటు టి.కాంగ్రెస్ పార్టీ కూడా వైసీపీ పార్టీకి మరో శత్రువుగా మారుతుంది. మరి పక్క రాష్ట్ర రాజకీయాలతో తమను నిందిస్తే వైసీపీ పార్టీకి రేవంత్ కూడా రిటర్న్ గిఫ్ట్ రెడీ చేయక తప్పని పరిస్థితి వస్తుంది.ఇక వైకాపా నాయకులు కూడా రేవంత్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ తో ఏపీలో వైసీపీ పార్టీ జెండా కూడా ఎగరవేయలేని పరిస్థితికి వస్తారు.అందుకే టీడీపీ తమ్ముళ్లు కూడా అంబటి మాకు ఇటువంటి విమర్శలే కావాలి..ఇంకా కావాలి…అంటూ అంబటిని రెచ్చకొట్టే పనిలో పడ్డారు.

చీకటి ఒప్పందాలతో వైసీపీ జెండా చాటున ఒక గులాబీ, ఒక కాషాయ కమలాన్ని దాచుకుంటున్న వైసీపీ పార్టీకి ఇప్పుడు గులాబీకి ఉన్న ముళ్ళు గుచ్చుకుంది. ఇక రానున్న రోజులలో కమలానికి ఉండే బురద అంటుకుంటుంది. ముందు ఆ రెండు పుష్పాల నుండి వైసీపీ జెండా కాపాడుకోండి ఆ తరువాత పక్క పార్టీల జెండాల గురించి ఏజెండాల గురించి పోస్టులు పెట్టొచ్చు మంత్రిగారు అంటూ అంతే ఘాటుగా రిప్లయ్ ఇస్తున్నారు టీడీపీ – జనసేన నేతలు.

ADVERTISEMENT
Latest Stories