President Trump

డోనాల్డ్ ట్రంప్‌ అంటేనే ఓ సంచలనం. మరి ఆయన అమెరికా అధ్యక్షుడైతో సంచలనాలు సృష్టించకుండా ఉంటారా? అందుకే కెనడా, మెక్సికో, చైనాలకు ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు.

ఈ మూడు దేశాల దిగుమతులపై భారీగా పన్నులు విధించారు. కెనడా, మెక్సికో దేశాల ఉత్పత్తులపై 25శాతం, చైనా ఉత్పత్తులపై 10 శాతం పన్ను విధించారు.

Also Read – ట్రంప్‌-మోడీ భేటీ ఎవరిది పైచేయి?

అమెరికాలో అక్రమంగా ప్రవేశిస్తున్నవారిని, నివసిస్తున్నవారి వలన అమెరికా ప్రజలు నష్టపోతున్నారని ట్రంప్ వాదిస్తున్నారు.

ఓ సగటు అమెరికన్ ఉద్యోగి గంటకు 20-25 డాలర్లకు చేసే పనులను విదేశీయులు 6-10 డాలర్లకే చేస్తుండటం వలన అమెరికన్ నష్టపోతున్నాడు. కనుక ట్రంప్ ముందుగా పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తున్న విదేశీ విద్యార్ధులపై ఆంక్షలు కటినతరం చేసి వారు క్యాంపస్‌లకే పరిమితం అయ్యేలా చేస్తున్నారు. కనుక వారి స్థానాలలో ఆమెరికన్లకి పని లభిస్తుందిప్పుడు.

Also Read – వైసీపీకి టీడీపీ పెర్‌ఫెక్ట్ సమాధానాలు… బావున్నాయి!

ఇక ఏ నగరమైన, దేశమైన అభివృద్ధి చెందితే అక్కడ సకల సౌకర్యాలతో పాటు సకల అవలక్షణాలు కూడా విస్తరిస్తుంటాయి. అమెరికాని పట్టి పీడిస్తున్న సమస్యలలో మాదక ద్రవ్యాలు కూడా ఒకటి.

పొరుగు దేశం మెక్సికో నుంచి నిషేదిత ‘ఫెంటానిల్’ వంటి మందులు మాదక ద్రవ్యాలు పెద్ద ఎత్తున అమెరికాలోకి వస్తున్నాయని వాటిని నియంత్రించేందుకు ఇటువంటి కటినమైన నిర్ణయాలు తీసుకోవలసివస్తోందని ట్రంప్ చెపుతున్నారు.

Also Read – అయ్యో పాపం ఆమాద్మీ… ఇలా కూడానా?

కానీ ఇంత హటాత్తుగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే అమెరికాపై కూడా దాని ప్రతికూల ప్రభావం తప్పక ఉంటుంది. కెనడా. మెక్సికో ఎగుమతులపై ట్రంప్ పన్నులు పెంచగానే ఆ మేరకు అమెరికా ఎగుమతులపై కూడా ఆ రెండు దేశాలు కూడా 25 శాతం పన్ను పెంచుతున్నట్లు ప్రకటించాయి! అంటే అమెరికా ఎగుమతిదారులు నష్టపోబోతున్నారన్న మాట!

ప్రతీదీ ముందుగా చెప్పి చేయడం ట్రంప్ అలవాటు. భారత్‌ ఎగుమతులపై కూడా సుంకం పెంచుతానని చెప్పారు. కనుక తర్వాత భారత్‌ వంతు అని అనుకోవచ్చు.

ఒకవేళ ట్రంప్ భారత్‌ ఎగుమతులపై పన్నులు పెంచితే ఆహారం, మందులు, వస్తు ఉత్పత్తులు తయారు చేసి ఎగుమతి చేస్తున్న పరిశ్రమలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది.

భారత్‌లో ఐటి కంపెనీలు లక్షల కోట్ల విలువైన ఐటి సేవలు కూడా అమెరికాకు అందిస్తున్నాయి. కనుక ట్రంప్ భారత్‌పై ఎగుమతులపై పన్నులు పెంచితే అవి కూడా భారీగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. కనుక ఆ నష్టం పూడ్చుకునేందుకు ఐటి కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు.

ఓ పక్క అమెరికా డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ పడిపోతుండటం ఆందోళన కలిగిస్తుంటే, ఇప్పుడు భారత్‌ ఎగుమతులపై ట్రంప్ పన్నులు పెంచితే ఊహించని స్థాయిలో నష్టం కలుగుతుంది.

ఆమెరికన్లకు ఆదాయపన్ను మినహాయిస్తానని ట్రంప్ చెపుతున్నారు. అలాగే వారి మిగులు ఆదాయం మరింత పెరిగేందుకు చర్యలు చేపడతానని కూడా చెప్పారు. ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలన్నీ అందుకు దోహదపడేలాగే ఉన్నాయి. ఇదివరకే చెప్పుకున్నట్లు అమెరికన్లు సుఖంగా జీవించేలా చేసే భారం ఇప్పుడు ప్రపంచ దేశాలపైనే పడుతోంది.