మైనింగ్ కుంభకోణంతో వివాదంలో చిక్కుకున్న గాలి జనార్దన్‌రెడ్డికి సన్నిహితులైన ఏడుగురు వ్యక్తులకు భాజపా టికెట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయంపై ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అయితే టిక్కెట్లు అయితే ఇచ్చారు గానీ గాలి సోదరులతో కలిసి ప్రచారం చెయ్యడం అమిత్ షా కు ఇష్టం లేదట.
ఇప్పటికే అమిత్‌షా కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేశారు. కానీ, ఆయన తన పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. బళ్లారికి వెళ్తే వివాదాస్పద గాలి సోదరులతో వేదిక పంచుకోవాల్సి వస్తుందనే ఈ పర్యటనకు అమిత్‌షా దూరంగా ఉంటున్నారని విశ్లేషకులు అనుకుంటున్నారు.
టికెట్లు దక్కిన గాలి అనుచరులను కేవలం వారి నియోజకవర్గాల్లో ప్రచారాలకు మాత్రమే పరిమితం చేయాలని అంటున్నట్లు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కర్ణాటకలో ప్రచారం చేయనున్నారు. అయితే, గాలి సోదరుల వివాదం నేపథ్యంలో మోదీ కూడా బళ్లారిలో ప్రచారానికి సుముఖత చూపట్లేదని స్థానిక భాజపా వర్గాల నుంచి సమాచారం. కలిసి కాపురం చేస్తూ కలిసి ఫోటోలు తీసుకోవడానికి మొహమాటమెందుకు మోడీ గారూ?



