కేసీఆర్ ప్రభుత్వంపై మోడీ… షా దృష్టిపెట్టనున్నారా?

Amit Shah - Narendra Modiబీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వానికి ఇచ్చిన వార్నింగ్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాజకీయ, అధికార కార్యకలాపాలకు త్వరలో ముగింపు తప్పదని రాంమాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ADVERTISEMENT

అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడుతూ ప్రజల పట్ల అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “ఒక ప్రభుత్వం ఎలా ఉండకూడదు అన్నదానికి ఉదాహరణ కేసీఆర్‌ సర్కారే. సగం సగం పూర్తయిన కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప, ఏడాది కాలంలో మీరు సాధించిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా? మీ ఏడాది పాలనపై ప్రోగ్రెస్‌ రిపోర్టు ఇచ్చే ధైర్యముందా?,” అంటూ సవాలు విసిరారు.

తమకు ఆదాయం వచ్చినా రాకున్నా, పన్నుల వాటా కింద తెలంగాణకు సుమారు 20వేల కోట్లు ఇస్తామని కేంద్రం మాట ఇచ్చిందన్నారు. ఇందుకు సిద్ధమేనని, కానీ రాష్ట్ర ప్రభుత్వం అవినీతికి, అసమర్థతకు మారుపేరుగా మారిందని ఆరోపించారు. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం పై రాష్ట్ర స్థాయి నాయకులు ఏం మాట్లాడిన ఢిల్లీ స్థాయిలోని వారు మాత్రం ఎప్పుడు పెదవి విప్పలేదు.

కరోనా ని హేండిల్ చేస్తున్న విధానంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో విమర్శలకు గురి అవుతుంది. ప్రజల నుండి కూడా వ్యతిరేకత మొదలయ్యింది. దీనిని ఢిల్లీ పసిగట్టింది అని రాంమాధవ్ వ్యాఖ్యల బట్టి అర్ధం అవుతుంది. గతంలో చంద్రబాబుని ఇబ్బంది పెట్టినట్టే ఇప్పుడు కేసీఆర్ ని టార్గెట్ చెయ్యగలరా అనేది చూడాలి.

ADVERTISEMENT
Latest Stories