Amit Shah sarcastic Comments Regarding Language on M K Stalin

దేశంలో అనేక భాషలు, సంస్కృతులు.. దేని గొప్పదనం దానిదే. ఒకటి తక్కువ మరొకటి ఎక్కువ అని వాదించడం ఆవివేకమే అవుతుంది. అయితే ఇంతటి భిన్నత్వం ఉన్న భారత్‌లో ఏకత్వం సాధించాలంటే దేశ ప్రజలందరికీ కామన్‌గా ఓ భాష అవసరం.

కనుక ప్రాంతీయ భాష, హిందీ, ఇంగ్లీషులతో త్రిభాషా విధానాన్ని అమలు చేసుకుంటున్నాము. కానీ ఇంగ్లీష్ మీడియం చదువులు మొదలైన తర్వాత వాటిలో ప్రాంతీయ (మాతృ) భాషకి చాలా నష్టం జరుగుతోంది.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

తీవ్ర భాషాభిమానం గల తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో కూడా ఇంగ్లీష్ మీడియం చదువుల వలన ఓ తరం మాతృభాషకు దూరమైంది. తర్వాత తరాలు ఇంకా వేగంగా దూరమవుతున్నారు.

కనుక ఇంగ్లీషు నుంచి మాతృభాషని ఎలా కాపాడుకోవాలని పాలకులు, ప్రజలు, విద్యావేత్తలు, మేధావులు ఆలోచించాలి. కానీ మన జాతీయ భాష అయిన హిందీ భాషపై తమిళనాడు సిఎం స్టాలిన్ వంటివారు కొందరు యుద్దాలు ప్రకటిస్తుండటం చాలా శోచనీయం.

Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?

తమిళనాడులో భాష ఒక సెంటిమెంటుగా ఉంటుంది. కనుక ఆ సెంటిమెంటుని రాజకీయాలకు ఉపయోగించుకునేందుకు హిందీని వ్యతిరేకించడం పరిపాటిగా మారిపోయింది. ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చురకలు వేశారు.

శనివారం చెన్నై సమీపంలో రాణిపేట జిల్లా నగరి కుప్పంలో జరిగిన సిఐఎస్ఎఫ్ 56వ ఆవిర్భావ వేడుకలలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ, “దేశ భాషలలో తమిళ భాష, సంస్కృతి చాలా అమూల్యమైనవి. మెడిసన్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యలు సైతం మాతృభాషలో చదువుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. కనుక తమిళనాడులో కూడా మెడిసన్, ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్యలు తమిళ మాద్యమంలో చదువుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలి,” అని సిఎం స్టాలిన్‌కి విజ్ఞప్తి చేశారు.

Also Read – ఇవి కదా… సంస్కరణలంటే?

మెడిసన్, ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్యలని మాతృభాషలలో భోదించాలనుకున్నా అసాధ్యం. ఎందువల్ల అంటే వాటిలో సాంకేతిక, శాస్త్రీయ పదాలు, వివరణలు అన్నిటినీ ప్రాంతీయ భాషలలో అనువదించడం దాదాపు అసాధ్యం. అందువల్లే తమిళనాడు ప్రజలకు ఎంత భాషాభిమానం ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఇంగ్లీష్ మాధ్యమంలోనే ఉన్నత విద్యలు నేర్చుకోకతప్పడం లేదు.

ఈ విషయం అమిత్ షాకు బాగా తెలుసు గనుకనే వాటిని తమిళ మాద్యమంలో నేర్చుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని వ్యంగ్యంగా అన్నారనుకోవచ్చు.




ఇంగ్లీషు నేర్చుకోవడానికి, చదువుకోవడానికి అడ్డురాని భాషాభిమానం హిందీ విషయంలోనే ఎందుకు? దేశ ప్రజలను కలిపే హిందీ భాష పట్ల ద్వేషం దేనికి?హిందీ పేరుతో రాజకీయాలు చేయడం అవసరమా?