chandrababu-naidu-and-amit-shah

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వంలో ఆంధ్రపద్రేశ్ ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో కేంద్ర పెద్దలతో రాష్ట్ర పెద్దలు చాలా సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇరు ప్రభుత్వ పెద్దల పర్యటనలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

అయితే ఈ జనవరి18 న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ రానున్నారు. విజయవాడలోని గన్నవరం సమీపంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎమ్ క్యాంపులను ప్రారంభించనున్నారు.

Also Read – తెలంగాణ సింహం బయటకు వస్తోంది మరి ఏపీ సింహం?

ఈ నేపథ్యంలో ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేసారు బాబు. జనవరి 8 న ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో భాగంగా మోడీ చేతుల మీదుగా గ్రీన్ హైడ్రోజన్ పార్క్, రైల్వే జోన్ పరిపాలన భవనాల శంకుస్థాపన జరిగిన విషయం విదితమే.

అప్పుడు మోడీ ఇప్పుడు షా ఇలా ఒకే నెలలో కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధాని, హోమ్ మంత్రి ఇలా ఇద్దరు ఏపీలో పర్యటించడం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి దోహదం చేస్తుంది.

Also Read – ట్రంప్‌-మోడీ భేటీ ఎవరిది పైచేయి?

రాష్ట్ర విభజనతో, వైసీపీ పాలనారాహిత్యంతో దెబ్బ మీద దెబ్బ తిన్న ఏపీ తిరిగి ఇతర రాష్ట్రాల మాదిరిగా నిలబడాలి అంటే ఏపీకి కేంద్ర ప్రభుత్వ సాయం తప్పనిసరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ దిశగా కేంద్ర పెద్దల ఆశీస్సుల కోసం జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు.

కేంద్ర సాయంతో ఏపీని పునర్నిర్మించుకుని, విజనరీ నాయకుడిగా మరోసారి ప్రజలు మెప్పు పొందడానికి సీఎం చంద్రబాబు పరితపిస్తున్నారు. అలాగే ఇటు షా పర్యటనలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కూడా భాగమవుతున్న నేపథ్యంలో ఈ ముగ్గురు నేతల మధ్య రాజకీయ చర్చలు కూడా కొనసాగే అవకాశం లేకపోలేదు.

Also Read – కర్నూలు హైకోర్టు బెంచ్‌కి తొలి విగ్నం.. వాళ్ళేనా?


షా అంగీకారంతో, మోడీ ఆమోదముద్రతో ఏపీలోని కూటమి ప్రభుత్వం అటు రాజకీయంగా ఇటు పాలనా పరంగా అడుగులు ముందుకు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో షా రాక, బాబు విందు మంతనాలు, పవన్ సాన్నిహిత్య సంబంధాలు ఏపీ అభివృద్ధికి ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి.