ఇండియాను ‘ల్యాండ్ ఆఫ్ రేప్స్’ అంటే సిగ్గుగా ఉందన్న మెగాస్టార్!

amitabh-bachchan-people-calling-india-a-land-of-rapesప్రస్తుతం ‘పింక్’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసారు. “మన దేశాన్ని విదేశీయులంతా ‘ల్యాండ్ ఆఫ్ రేప్స్’ అని పిలుస్తోంటే సిగ్గుగా ఉందని, దేశంలోని ఏ ప్రాంతంలో అయినా మహిళల భద్రతకు ఢోకా లేకుండా ఉండాలని కోరారు. భారతదేశంపై విదేశీయుల్లో ఉన్న అపోహను తొలగించేందుకు ప్రతి భారతీయుడు పాటు పడాలని, ఇండియాను మూడో తరగతి దేశంగా కానీ, అభివృద్ధి చెందుతున్న దేశంగా కానీ పేర్కొంటే తనకు పెద్దగా ఇష్టం ఉండదని, భారత్ ను అంతా అభివృద్ధి చెందిన దేశంగా పేర్కొనాలని ఆకాంక్షించారు. అలా జరగాలంటే మహిళలపై దారుణాలు ఆగిపోవాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని” అమితాబ్ కోరారు.

“ప్రతి రోజూ నిద్ర లేస్తాను. ఏదో ఒక సినిమాలో నటిస్తూనే ఉంటాను. నేను కూడా కడుపు నింపుకోవాలి కాబట్టే సినిమాల్లో పని చేస్తున్నాను. మీరు కూడా అందుకే కదా ఉద్యోగాలు చేసేది అని మీడియాను ప్రశ్నించారు. తనకు స్పూర్తి తన తల్లి అని, చిన్నతనంలో ఓ సారి ఇంటి వెనుక ఆడుకుంటుండగా, కొంత మంది తన వయసు పిల్లలు తనను కొట్టారని గుర్తుచేసుకున్నారు. అప్పుడు తాను ఏడుస్తూ ఇంట్లోకెళ్లగా, తన తల్లి తనలో స్పూర్తి నింపి తిరిగి వారిని కొట్టమని పంపారని అన్నారు. ఆమె సిక్కు మహిళ అని, అందుకే తాను సగం సర్దార్ నని” చెప్పుకొచ్చారు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories