చావులతో రాజకీయం….వైసీపీ ట్రేడ్ మార్కా.?

YSRCP leaders at a political gathering

చావు పుట్టలను కూడా రాజకీయానికి వాడేసుకునే స్థాయికి రాజకీయ పార్టీలు, ఆ పార్టీల జెండాలు మోసే నేతలు దిగజారిపోతున్నారా అన్న స్థాయికి వైసీపీ రాజకీయాలు పతనమవుతున్నాయి.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తో పుట్టిన వైసీపీ ఇప్పటికి మరణాల చాటున, చావుల మాటున రాజకీయం చేస్తూనే వస్తుంది. నాటి వైఎస్ మరణాన్ని ఓదార్పు యాత్రగా మలచి తన పొలిటికల్ న్యూ జర్నీ కి బాటలు వేసుకున్నారు వైఎస్ జగన్ అనే ఆరోపణ వైసీపీ ని నిరంతరం వెంటాడుతూనే వస్తుంది.

ADVERTISEMENT

అధినేత బాటలోనే పార్టీ నేతలు, క్యాడర్ అన్నట్టుగా నాటి నుంచి నేటి వరకు కూడా వైసీపీ శవ రాజకీయాలు చేయడంలో దిట్ట అన్న టాక్ సంపాధించుకోగలిగింది. నాటి వివేకా గొడ్డలి వేటు కథను గుండె పాటుగా మార్చి మొదలుపెట్టిన నారాసుర రక్త చరిత్ర రాజకీయం చివరికి అవినాష్ రెడ్డి వద్దకు వచ్చి ఆగింది.

ఇక పొద్దున్న లేస్తే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ సీఎం చంద్రబాబు నాయుడు చావు మీద పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బాబు కి గుండె పోటు వచ్చి హరి అంటాడేమో, నిద్రలోనే టప కట్టేస్తాడేమో అంటూ ఇలా వ్యక్తి చావు వంటి సున్నితమైన అంశాన్ని కూడా రాజకీయ ప్రకటనలు గా మారుస్తున్నారు జగన్.

తాజగా సాయికృష్ణ వివాదానికి కూడా కుల ముద్ర వేసి ఆయన మరణం పై కూడా రాజకీయం సాగించారు. ఇక నిన్న ముద్రగడ అంతిమ నివాళి సమయంలో వైసీపీ నేతలు చేసిన రాజకీయం ‘నభూతో నభవిష్యతి’ అనే చెప్పాలి. ఒక వ్యక్తికీ అత్యంత గౌరవప్రదమైన అంతిమ నివాళి అంటే అది ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరగడమే.

అటువంటి అవకాశం కోరిమరి చెంతకు వస్తే అందుకు వైసీపీ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదనే చెప్పాలి. చివరికి తండ్రిని చివరి చూపు చూసుకోవడానికి వచ్చిన కుమార్తె మీద కూడా వైసీపీ శ్రేణులు చేసిన నినాదాలు గమనిస్తే వైసీపీ శ్రేణుల రాజకీయ విలువలను ఈ స్థాయికి పతనమయ్యాయా.? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఎవ్వరు లక్ష్మి పార్వతిని తమ కుటుంబ సభ్యురాలిగా భావించారు, అలాగే లక్ష్మి పార్వతి కూడా ఎప్పుడు టీడీపీ కి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం చేస్తూనే ఉంటుంది, ఇక ఎన్టీఆర్ కుటుంబానికి ప్రత్యర్థిగా ప్రకటనలు ఇస్తూనే వస్తుంది.

అయినా కూడా అటు ఎన్టీఆర్ కుటుంబం కానీ ఇటు టీడీపీ పార్టీ కానీ ఆమెను ఎన్నడూ ఎన్టీఆర్ ఘాట్ కి రాకుండా, ఆయనకు నివాళి అర్పించకుండా ఆపలేదు. రాజకీయాలకు – వ్యక్తిగత భావాలకు మధ్య ఉన్న అంతరాన్ని అర్ధం చేసుకుని వీళ్ళు ముందుకెళుతుంటే వైసీపీ మాత్రం ఏదైనా రాజకీయమే అన్నట్టుగా ముందుకెళ్లడం, ఆదిశగా రాజకీయం చేయడం వైసీపీ ట్రేడ్ మార్కా.? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories