పార్టీలో చేరకముందే ఆనంకు జగన్ మార్కు షాక్

anam ramanarayana reddy -anamvivekanandareddyనెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగు దేశం వదిలి జగన్ పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. అయితే అది జరగకముందే ఆనం సోదరుడు వివేకా కాలం చేసారు. ఆనం వివేకానందరెడ్డి భౌతికకాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు.

ADVERTISEMENT

సోదరుడు ఆనం రామనారాయణరెడ్డిని, కుటుంబసభ్యులను పరామర్శించిన సీఎం వారికి ధైర్యం చెప్పారు. సాయంత్రం అధికార లాంఛనాలతో పెన్నా తీరంలో ఆనం వివేకానందరెడ్డి అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీలోకి చేర్చుకోవాలనుకుంటున్న జగన్ మాత్రం కుటుంబాన్ని పరామర్శించడానికి రాలేదు.

రేపు కోర్టుకు హాజరు కావడానికి జగన్ ఈ రోజే హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆనం కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో మాత్రమే పరామర్శించారు. దీనిపై ఆనం ఏమి స్పందించకపోయినా ఆయన అనుచరులు మాత్రం జగన్ పార్టీలోకి వెళ్తే మనకు దక్కే మర్యాద ఇదే అని చెప్పుకోవడం మొదలు పెట్టారట. పార్టీలో చేరకముందే ఆనంకు జగన్ మార్కు షాక్ ఇచ్చినట్టున్నారు.

ADVERTISEMENT
Latest Stories