2019లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని… అలాగే మరో 30 సంవత్సరాలు జగనే సిఎంగా ఉంటారని జగన్ తో పాటు ఆ పార్టీ నేత రోజా పగటి కలలు కంటున్నారు. నిజానికి మరో మూడు నెలల వరకు వైసీపీ ఉంటే చాలా గొప్ప. అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోయిన తర్వాత ఆ పార్టీ ముఖ్య నేతలందరూ పార్టీలు మారబోతున్నారు, దీంతో వైసీపీ పూర్తిగా ఖాళీ కావడం ఖాయం. ప్రతిపక్ష నేతగా జగన్ ఏ మాత్రం పనికిరాడు, వ్యాపార లావాదేవీల కోసం పార్టీ ఆవిర్భావ రోజున కనీసం పార్టీ జెండా కూడా ఎగురవేయని జగన్, పార్టీని ఏ విధంగా నడిపిస్తాడు.
ఈ వ్యాఖ్యలన్నీ ఆనం వివేకానందరెడ్డి నోటి వెంట వస్తే… ఆ హంగామానే వేరు కదా! రాజకీయాల్లో కామెడీ ప్రెస్ మీట్ లకు ‘బ్రాండ్ అంబాసిడర్’ అయినటువంటి నెల్లూరు జిల్లా నేత ఆనం వివేకానందరెడ్డి మరోసారి రోజా, జగన్ లపై విరుచుకుపడుతూ చేసిన విమర్శలివి. నెల్లూరులోని తన కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో భాగంగా వైసీపీపై భవిష్యవాణిని వినిపించారు ఆనం.



