‘రాజకుమారుడు’ సినిమా నుండి ‘బ్రహ్మోత్సవం’ వరకు ప్రిన్స్ మహేష్ బాబు బుల్లితెరపై పాల్గొన్న ఏకైక కార్యక్రమం ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా.’ మహేష్ ను యాంకరింగ్ చేసిన ఘనతను ప్రదీప్ సొంతం చేసుకున్నాడు. ఈ కార్యక్రమ నిర్వాహకుడిగా ఎంతోమంది సెలబ్రిటీల మనసు దోచుకున్న ప్రదీప్ తాజాగా, ఆ సెలబ్రిటీలలో ఒకరు కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ ఊపందుకుంది.
తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ముందాసుపట్టి’ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్న నేపధ్యంలో… ఈ యాంకర్ ప్రదీప్ హీరో అవతారం దాల్చనున్నారనే సమాచారం హల్చల్ చేస్తోంది. 1980వ దశకంలో జరిగిన కధగా తెరకెక్కిన ఈ సినిమా సెటైరికల్ కామెడీగా రూపుదిద్దుకుంది. తొలుత ఈ సినిమాలో మహేష్ బావ సుధీర్ బాబుని ఎంపిక చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
అయితే కాలక్రమేణా మహేష్ బావ సుధీర్ అవుట్ అయ్యి, మహేష్ యాంకర్ ప్రదీప్ ఇన్ అవ్వడం ఆసక్తికరంగా మారింది. బుల్లితెరపై విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించిన వ్యక్తిగా ప్రదీప్ కు చాలా మంచి పేరు ఉంది. మరి అదే విజయ పరంపర వెండితెర పై కూడా కొనసాగిస్తాడా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. అయితే సదరు సమాచారంపై ఓ అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.



