
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. అయితే జగన్ నిర్వాకం వలన రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోవడమే గాక దాదాపు పది లక్షల కోట్లు అప్పులు కూడా పేరుకుపోయాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇంత అధ్వానంగా మారినందునే జగన్ ప్రభుత్వం నెలనెలా ప్రభుత్వోద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేకపోయేది. కాంట్రాక్టర్లకు బిల్లులు, ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న ఆస్పత్రులకు బకాయిలు పెట్టి చేతులు దులుపుకు వెళ్ళిపోయారు. అంటే జగన్ అధికారంలో ఉన్నప్పుడే కాదు… లేనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సమస్యలు తప్పడం లేదన్న మాట!
Also Read – అందరి చూపు, నాని HIT వైపే
కనుక ఈ పరిస్థితులలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం సాధ్యం కాదని, రెండు నెలల తర్వాత కాస్త పరిస్థితులు చక్కబడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని సిఎం చంద్రబాబు నాయుడు నిన్న శాసనసభలో ప్రకటించారు. కనుక రాబోయే రెండు నెలలకి ప్రభుత్వం, రాష్ట్ర నిర్వహణ ఖర్చుల కొరకు ‘ఓట్ ఆన్ అకౌంట్’ బడ్జెట్‌ని నేడు శాసనసభలో ప్రవేశపెడతామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఒకవేళ ఏపీలో వైసీపి మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే కాకి లెక్కలతో ప్రజలను మభ్యపెట్టేందుకు 2-3 లక్షల కోట్లతో బారీ బడ్జెట్‌నే ప్రవేశపెట్టి ఉండేది. సిఎం చంద్రబాబు నాయుడు కూడా అదేవిదంగానే చేసి ఉండవచ్చు. కానీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేని పరిస్థితి నెలకొని ఉందని నిర్మొహమాటంగా చెప్పేశారు.
Also Read – రివ్యూల దీపం ఆర్పేస్తే, సినిమా అంధకారంలో మునిగిపోతుంది.
బడ్జెట్ విషయంలో కొత్త ప్రభుత్వానికి ఇటువంటి పరిస్థితి దాపురించడం గమనిస్తే గత ప్రభుత్వం చేసిన ఆర్ధిక విధ్వంసం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. కనుక రెండు నెలల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచన సమంజసంగానే ఉంది.
అప్పటికి ఆర్ధిక పరిస్థితి కాస్త గాడిన పడుతుంది కనుక సూపర్ సిక్స్ పధకాలతో పాటు రాష్ట్రాభివృద్ధికి సంబందించి పూర్తి వివరాలతో, కేటాయింపులతో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.