తెలుగు ప్రేక్షకుల జీవితాల్లో సినిమా భాగం అయిపోయింది. అయితే, జగన్ ప్రభుత్వం పుణ్యమా అని ఏపీలో సినిమా భవితవ్యానికి సమస్యల సుడిగుండం ఏర్పడింది. అయితే, త్వరలోనే ఈ అగాధం తొలిగిపోనుందని.. తెలుగు తెర పై జగన్ వరాల జల్లు కురిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో ఏపీలో సినిమా టికెట్ ధరల పై జీవో వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఈ జీవోలో ముఖ్యంగా సినిమా టికెట్ రేట్లు పెంపు పై నిర్ణయం తీసుకోబోతున్నారని బలంగా వినిపిస్తోంది. అయితే, హోం కార్యదర్శి నేతృత్వంలో.. సిద్ధం చేసిన నివేదికను చూసిన తర్వాతే జగన్ నిర్ణయం ఉంటుంది. కాకపోతే, స్టార్ హీరోలతో మీటింగ్ తర్వాత, జగన్ సానుకూలంగా ఉన్నాడని ప్రచారం జరుగుతున్నా.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
ముఖ్యంగా బయ్యర్ల నుంచి చిన్న నిర్మాతల వరకూ.. జగన్ అందరికీ సంతృప్తికరంగా నిర్ణయం తీసుకోగలడా ? ఒకవేళ, టికెట్ రేట్లు పెంచితే.. చిన్న సినిమాలకు నష్టం, పెంచకపోతే పెద్ద సినిమాలకు నష్టం. పోనీ, సినిమా స్థాయికి తగ్గట్టుగా రేట్లు ఫిక్స్ చేద్దామంటే.. బయ్యర్లకు ఇబ్బంది. అయినా రిస్క్ చేద్దామంటే.. ఏ సినిమాకి ఏ ఏరియాలో ఎంత కలెక్షన్స్ వచ్చాయో నిర్మాతలకు క్లారిటీ మిస్ అయ్యే అవకాశం ఉంది.
సరే ఆన్ లైన్ టికెట్ విధానం నమ్ముకుందామంటే.. ప్రభుత్వం తమను ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అని నిర్మాతల భయం. ఏ రకంగా చూసుకున్న ఇదంతా గందరగోళ అగమ్యగోచరంగానే ఉంది వ్యవహారం. దీనికితోడు గ్రామాల్లో ఉండే మల్టీప్లెక్స్ టిక్కెట్ల రేట్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని థియేటర్లలో టికెట్ల రేట్లు మధ్య చాలా వ్యత్యాసం చూపించాల్సి ఉంటుంది.
అలాగే భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలను ప్రత్యేకంగా పరిగణించాల్సి ఉంది. అన్నీ సినిమాలకు ఒకటే టికెట్ రేటు విధానం పెద్ద సినిమాలకు సరితూగదు. మరి ఇన్నీ అవకతవకల మధ్య జగన్ టికెట్ లెక్కలు తేలేది ఎలా ? ఇదంతా చూస్తుంటే.. ఈ టికెట్ల వ్యవహారం ఇంకా గందరగోళ అగమ్యగోచరమే అనిపిస్తుంది.