కేంద్రం వద్ద రాష్ట్ర బీజేపీ మంత్రి కంప్లయింట్

andhra-pradesh-latest-updates-bjpరాష్ట్ర బీజేపీలోని తెలుగు దేశం వ్యతిరేక వర్గం తన పని తాను చేసుకుంటూ పోతుంది. బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీని దెబ్బ కొట్టే ప్రయత్నాలు చేస్తుంది. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు ఉన్నఫళంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీని కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లయింట్ చేసారు

‘‘ఏపీలో నగదు కొరత వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే ఎందుకు వస్తోందో ప్రభుత్వ సంస్థల ద్వారా విచారణ చేయించండి’’ అని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంలోని పెద్దలు బ్యాంకులలోకి వచ్చే నోట్లను తనకు కావలసిన వాళ్ళకు మళ్లించి కృత్రిమ కొరత సృష్టిస్తుందని రాష్ట్ర బీజేపీ నేతల ఉద్దేశం.

ADVERTISEMENT

ఆర్థికమంత్రి జైట్లీతో విజయవాడలో పాత్రికేయుల సమావేశం పెట్టి ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన అపోహలు తొలగించాలని కూడా ఆయన కోరారు. అయితే మాణిక్యాలరావు తెలుసుకోవాల్సింది ఏంటంటే నగదు కొరత పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఉంది. చాలా రాష్ట్రాలలో ఈ సమస్య తరచూ వినిపిస్తుంది కూడా.

ADVERTISEMENT
Latest Stories