Raghu-Rama-Raghuతిరుపతికి మీరు పెట్టిన పేరేంటయ్యా… బాలాజీ జిల్లానా? బుద్దుందా? బుద్దుందా? అని అడుగుతున్నాను. అక్కడున్న ఈవోలకు చెప్పక్కర్లా? తిరుమల తిరుపతి బాలాజీ అని పేరున్నప్పటికీ కూడా ‘బాలాజీ’ అంటే నార్త్ ఇండియాలో ఆంజనేయ స్వామి, హనుమంతుడు.

బాల అంటే చిన్నపుడు ఆంజనేయస్వామిని ఉత్తరాదిలో ఎక్కువగా కొలుస్తారు. నార్త్ ఇండియాలో తెలిసిన బాలాజీ అంటే కేవలం లార్డ్ హనుమ మాత్రమే. బాలాజీ అనే పేరు స్వామి భక్తుడని, ‘వెంకటేశ్వర స్వామి మహత్యం’ సినిమాలో కూడా చూపించారని, అది వాడుకలో తిరుమల తిరుపతి బాలాజీగా సంభోదిస్తున్నారని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇవన్నీ ఖచ్చితంగా తెలిసి ఉండవని, కానీ తిరుపతిలో ఉన్న జవహర్ రెడ్డి గానీ, ధర్మారెడ్డి గానీ సీఎంకు చెప్పాలని, బాలాజీ అన్న పదం తెలుగునాట 1 శాతం కూడా వినియోగించరని, ఇదంతా వాళ్ళు చెప్పరు, ఈయనకు తెలియదు, నోటికొచ్చినట్లు పేర్లు పెట్టేయడం ఏంటన్న ఆవేదనను వ్యక్తం చేసారు రఘురామకృష్ణంరాజు.

తిరుపతికి ఏ శ్రీ వెంకటేశ్వర అనో, శ్రీనివాసుడు అనో పెడితే సబబుగా ఉండేదని అన్నారు. అలాగే చిన్న తిరుపతి ఏలూరుకు దగ్గరగా ఉంటే దానిని తీసుకువెళ్లి తూర్పు గోదావరి జిల్లాలో కలిపారు. ఇక కడప గురించి మీకు చెప్పాల్సి రావడం మా దౌర్భాగ్యం. దేవుని తొలి గడపగా కడపకు ఉన్న విశిష్టత మరియు కవులకు కాణాచిగా కడప పేరు లేకుండా కేవలం వైఎస్సార్ జిల్లాగా నామకరణం చేయడం సబబు కాదని అన్నారు.

కులాల మధ్యన చిచ్చు పెట్టకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని, మరిన్ని కులాల మధ్య కుంపట్లకు, మరిన్ని ప్రాంతాల మధ్య విద్వేషాలకు దారి తీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రజాప్రతినిధిగా మీ మీద ఉందని ఆర్ఆర్ఆర్ అన్నారు. అసలు ఇది వస్తుందా, చస్తుందా అన్న విషయం ఇంకా తెలియదని, 2021 సెన్సెక్స్ పూర్తయ్యేదాకా రాదని, కేవలం ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టేందుకు తప్ప దేనికి ఉపయోగం ఉండదని అభిప్రాయ పడ్డారు.