ఎన్నికల సీజన్ Vs పొలిటికల్ హీట్!

Andhra-Pradesh-2019-Elections---Which-Way-Are-The-Winds-Blowing2019లో దేశవ్యాప్తంగా లోక్ సభకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తే తప్ప, ఇందులో ఎలాంటి మార్పుచేర్పులు ఉండబోవు. కాలం గడుస్తున్న కొద్దీ మోడీపై ప్రజలలో నమ్మకం సన్నగిల్లుతుండడంతో, ముందస్తుకు వెళ్దామనే యోచనలో మోడీ అండ్ కో ఒక్కరే ఉన్నారు తప్ప, ముందస్తు ఎన్నికలకు మరే ఇతర పొలిటికల్ పార్టీ కూడా సిద్ధంగా లేదు.

ప్రస్తుతం హల్చల్ చేస్తోన్న టాక్ ప్రకారం అయితే… వచ్చే ఏడాది మార్చి నుండి జూన్ వరకు పొలిటికల్ హీట్ ఓ రేంజ్ లో ఉండనుంది. ఓటింగ్లు, లెక్కింపులు… వీటిపై బెట్టింగ్ లు వంటి అంశాలతో రాజకీయం రాజ్యమేలడం సహజం. అందులోనూ దేశవ్యాప్తంగా మోడీకి ఎదురుగాలి వీస్తోందన్న సంకేతాలతో, కేంద్రంలో ఈ సారి ఎవరు అధికారంలోకి వస్తారా? అని దేశమంతా నిరీక్షిస్తోంది. అలాగే ఏపీలో కూడా రాజకీయం రంజుగా సాగనున్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ADVERTISEMENT

ఇలా వచ్చే సమ్మర్ లో పొలిటికల్ వేడి ప్రజలందరినీ తాకనున్న నేపధ్యంలో… అదే సమయంలో ధియేటర్లలోకి తమ సినిమాలను తీసుకువచ్చి, ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో టాలీవుడ్ టాప్ హీరోలు ఉండడం విశేషం. ఇప్పటికే వచ్చే ఏడాది సమ్మర్ కు యంగ్ రెబల్ స్టార్ “సాహో” సిద్ధమవుతుండగా, దీనికి పోటీగా మెగాస్టార్ చిరంజీవి “సైరా” కూడా రానుందన్న ప్రచారం జరుగుతోంది. తక్కువ కాలవ్యవధిలో ఈ రెండు సినిమాలు అలరించనున్న నేపధ్యంలో తాజాగా మరో సినిమా సమ్మర్ హీట్ ను పెంచనుంది.

ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమాగా రూపుదిద్దుకుంటోన్న సినిమాను ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నామని దిల్ రాజు సంస్థ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. ఇతర రెండు పెద్ద సినిమాలు, ఈ సినిమాకున్న తేడా ఏమిటంటే… రిలీజ్ డేట్ విషయంలో స్పష్టత. ఆ రెండు సినిమాలు ‘సమ్మర్ బొనంజా’గా విడుదల చేస్తామని చెప్పారు గానీ, ఖచ్చితమైన తేదీలను మాత్రం ప్రకటించలేదు. కానీ ఈ మూడు భారీ సినిమాలు కూడా ఎన్నికల సీజన్ లోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయని మాత్రం వాస్తవం.

ADVERTISEMENT
Latest Stories