వైసీపీ నేతల అరాచకాలు వారి అనుచరుల దాడులు మెయిన్ స్టీమ్ మీడియాలో ప్రచారానికి కూడా నోచుకోవడంలేదు. ఎదో ఒకటి రెండు ఛానెల్స్ తప్ప మిగతా అన్ని తెలుగు మీడియా ఛానెల్స్ ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాయడానికి కూడా సాహసం చేయడంలేదనే చెప్పాలి. RRR చెప్పినట్టు ఏపీలో ప్రముఖ ఛానెల్స్ గా చెలామణి అయ్యే కొన్ని సాక్షికి అనుబంధంగా తయారయ్యాయని…అవి కూడా పూర్తిగా బ్లూ మీడియాగా మారిపోయాయంటూ న్యూస్ ఛానెల్స్ పై పలుమార్లు విమర్శలు కూడా చేశారు.
ఈ నేపథ్యంలో వైసీపీ నేతల అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి సోషల్ మీడియానే అస్త్రంగా మార్చుకున్నారు వైసీపీ వ్యతిరేక వర్గం.పుంగనూరులో టీడీపీ శ్రేణుల పై వైసీపీ అనుచరుల దౌర్జన్యాలు, కావలి ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై వైసీపీ నేతల దాష్టికాలు, పీలేరు ఎమ్మార్వో కార్యాలయంలో వైసీపీ నేతల బూతుల పంచాంగాలు…ఇలా ఎన్నో వైసీపీ నేతల దారుణాలు సోషల్ మీడియా ద్వారానే వెలుగులోకి వచ్చాయి.
ఇలాగే మరికొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యాయి. వాటిలో నగర సిబారులో నడి రోడ్డు మీద వైసీపీ జెండాలతో జగనన్న జేబ్రాండ్ల మద్యం సీసాలతో వైసీపీ అనుచరులు హలచల్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సందడి చేసింది. అయితే ఆ రోడ్డు మొత్తం గుంతల మయంగా ఉండడంతో కనీసం మీరు తాగే మద్యం డబ్బులతో
అయినా మీ జగన్ అన్నను రోడ్ల మరమత్తులు చేయించమనండి బాబు అంటూ సెటైర్లు పేలాయి.
తాజాగా పెదకూరపాడు నియోజకవర్గం అమరావతిలో అర్ధరాత్రి ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి స్థానిక ప్రజలు ఆ అక్రమ తవ్వకాలను అడ్డుకుంటున్న వీడియోలు ఇప్పుడు తెలుగు దేశం సామజిక మాధ్యమాలలో పోస్టు చేశారు.అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే ఈ ఇసుక అక్రమ తవ్వకాలకు పోలీస్ అధికారుల మద్దతు ఉండడం జగన్ ప్రభుత్వం వ్యవస్థలను ఎంతలా దుర్వినిగయోగం చేస్తుందో అర్ధమవుతుంది.
అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు తమ గ్రామ సంపదను తరలిస్తున్న అక్రమార్కులను అడ్డుకోవడానికి రోడ్లకు అడ్డంగా కూర్చున్న స్థానికుల పై ఎదురు ప్రశ్నలు వేయడం, వారితో వాదించడం మొత్తం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలా సోషల్ మీడియా మాత్రం వైసీపీ నేతల పాలిట బొమ్మాళిగా మారిందనే చెప్పాలి. “సోషల్ మీడియా: వదల వైసీపీ నిన్ను వదలా!” అంటూ వైసీపీ అరాచకాలకు నీడలా మారింది.




