ఏపీకి మొండిచేయే – సుప్రీంలో తేల్చేసిన కేంద్రం!

Supreme-Court-Raps-the-Center-for-Non-Implementation-of-Bifurcation-Promisesఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చాలా చేసాం.., ఇంకా చేయాల్సింది కూడా ఏమీ లేదు…, నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పినవన్నీ చేయడం సాధ్యం కాదు…, ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ అస్సలు సాధ్యం కాదు… అంటూ సుప్రీంకోర్టులో కేంద్ర ఆర్ధిక శాఖ ఓ అఫిడవిట్ ను సమర్పించింది. విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదంటూ కాంగ్రెస్ నేత పొంగులేటి దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్ గా కేంద్ర ఆర్ధిక శాఖ ఈ అఫిడవిట్ ను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

ఈ అఫిడవిట్ లో స్పెషల్ స్టేటస్ ఇచ్చే ఉద్దేశం లేదన్న విషయం స్పష్టంగా తెలియజేయగా, రైల్వేజోన్ అంశాన్ని అస్సలు ప్రస్తావించకపోవడం కేంద్ర తీరుకు అద్దం పడుతోంది. అంతేకాదు, రెవిన్యూ లోటు నేపధ్యంలో ఏపీకి చెల్లించాల్సిన మొత్తం కేవలం 4116 కోట్లు మాత్రమేనని, ఇందులో ఇప్పటివరకు 3979 కోట్లు ఇచ్చేసి ఉన్నామని తెలిపింది. అలాగే రాజధాని నిర్మాణానికి 2500 కోట్లు కూడా ఇచ్చామని, యూసీలు సమర్పించిన తర్వాత మరో మూడేళ్ళల్లో ఏడాదికి 330 కోట్లను మంజూరు చేస్తామని తెలిపింది.

ADVERTISEMENT

సుప్రీంకోర్టులో కౌంటర్ గా దాఖలు చేసిన అఫిడవిట్ లో ఇప్పటివరకు రాజకీయంగా ఏ ఏ అంశాలను చెప్పుకొచ్చారో వాటినే మళ్ళీ అఫిడవిట్ రూపంలో ఉంచారు తప్ప కొత్త విషయాలు ఏమీ చెప్పలేదు. అయితే సర్వోన్నత న్యాయస్థానానికి కూడా అవే అంశాలు చెప్పడంలో ఆంధ్రప్రదేశ్ పై కేంద్రం వైఖరి మారేది లేదన్న విషయం మరోసారి స్పష్టమయ్యింది. ఇదే సమయంలో ఇప్పటివరకు ఏపీకి చేసింది కూడా ఏమీ లేదని ఈ అఫిడవిట్ ద్వారా ఒప్పుకున్నట్లయ్యింది.

ADVERTISEMENT
Latest Stories