Another Plan For Andhra Pradesh Development

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు సముద్రతీరం, ఓడరేవులు లేకుండాపోయాయి. కనుక మచిలీపట్నం పోర్టులో భాగం ఇవ్వాలంటూ కొందరు బిఆర్ఎస్ నేతలు వితండవాదం చేశారు. అంటే సముద్రతీరం, ఓడరేవులు ప్రాధాన్యత వారికి అర్ధమైందన్న మాట!

ఆంధ్రప్రదేశ్‌‌ వైసీపీ నేతలకు వాటి విలువ ఇంకా బాగా తెలుసు. కనుకనే కాకినాడ పోర్టుని కబ్జా చేసి అక్కడి నుంచి 5 ఏళ్ళపాటు యదేచ్చగా రేషన్ బియ్యం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసుకున్నారు.

Also Read – జగన్‌కి ఓదార్పు కావాలి.. ఎవరైనా ఉన్నారా ప్లీజ్?

పోర్టు నుంచి రేషన్ బియ్యం పంపాలంటే సమీపంలో గోదాములు ఉండాలి. కనుక మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నంలో తన గోదాములను ఇందుకు బాగా ఉపయోగించుకున్నారు.

కానీ ఈ పోర్టులను సక్రమంగా వినియోగించుకుంటే అవి రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతాయని నిరూపితమైంది.

Also Read – విశ్వసనీయత అంటే సంక్షేమ పధకాలు అమలుచేయడమేనా?

విభజనతో, ఆ తర్వాత జగన్‌ పాలనతో జరిగిన నష్టం నుంచి కొలుకోవాలంటే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న పోర్టులను, త్వరలో సిద్దమవుతున్న పోర్టులు కలిపి మొత్తం ఆరు పోర్టులను నూటికి నూరుశాతం వినియోగించుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వాటికి అనుబందంగా 8 క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఇప్పటికే దీని కోసం మారిటైం బోర్డు కొన్ని ప్రణాళికలు కూడా సిద్దం చేసింది. రాష్ట్రంలోని ఆరు పోర్టులకు 100 కిమీ పరిధిలో పారిశ్రామికవాడలు నిర్మించాలని, 25 కిమీ పరిధిలో అత్యాధునిక సదుపాయాలతో చిన్న చిన్న నగరాలు లేదా పట్టణాలు నిర్మించాలని ప్రతిపాదిస్తోంది.

Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?

ఇక పోర్టులో కార్యకలాపాలు నిర్వహించే సంస్థల కోసం సకల ఆధునిక సదుపాయాలతో కార్యాలయాలు, పోర్టు అధికారులు, పోర్టు ఉద్యోగులు, వాటిలో పనిచేసే వివిడం కంపెనీల ఉద్యోగులు నివశించేందుకు రెసిడెన్షియల్ కాలనీలు వగైరా నిర్మించాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వీటిలోనే పోర్టుల ద్వారా ఎగుమతి దిగుమతి అయ్యే ఆహార మరియి ఇతర ఉత్పత్తులను నిలువ చేసేందుకు భారీ గోదాములు నిర్మించాలని ప్రతిపాదిస్తోంది.

పోర్టులకు అనుబందంగా ఏర్పాటు చేయబోతున్న ఈ ప్రాంతాలను చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాలతో రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ రోడ్లు, వీలైన చోట్ల రైలు మార్గాలు ఏర్పాటు చేయాలని ఏపీ మారిటైం బోర్డు భావిస్తోంది.

పోర్టులకు అనుబందంగా పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయడం వలన అక్కడ తయారయ్యే వివిద ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడం, వాటికి అవసరమైన వాటిని దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం చాలా సులువు అవుతుంది.

పోర్టు, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఇటువంటి కార్యకలాపాలు మొదలైతే, వేలాదిమందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, పరోక్షంగా ఉపాధి లభిస్తాయి. ఆ ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయి. పోర్టులు, వాటి అనుబందంగా ఏర్పాటు చేయబోతున్న ఈ క్లస్టర్స్ నుంచి పన్నుల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం లభిస్తుంది కూడా.

అయితే ఇవన్నీ చాలా వ్యయ ప్రయాసలతో కూడినవి కనుక ముందుగా వీటి కోసం కన్సెల్టెన్సీ సంస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారానే పీపీపీ పద్దతిలో ఈ నిర్మాణ, అభివృద్ధి పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఏపీ మారిటైం బోర్డు త్వరలో టెండర్లు పిలువబోతోంది.




ఇంతకాలం ప్రభుత్వాలు కేవలం పోర్టులు ఏర్పాటు చేయడం వరకే పరిమితమయ్యేవి. ఆ కారణంగా పోర్టుల చుట్టుపక్కల ప్రాంతాలు వాటంతట అవి అభివృద్ధి చెందేందుకు అనేక ఏళ్ళ సమయం పడుతుండేది. కానీ ఇప్పుడు ఓ పక్క పోర్టులు నిర్మాణంలో ఉండగానే వాటికి అనుబందంగా ఇవన్నీ ఏర్పాటు చేయాలనే ఆలోచన చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ ఆలోచన కార్యరూపం దాల్చి, పూర్తయితే ఏపీ రాకేట్ స్పీడుతో అభివృద్ధి సాధించడం తధ్యం.