మహిళా మంత్రులకు వారి పక్కన కూర్చోనే ధైర్యం ఉందా?

AP Assemblyఓ కుటుంబంలో ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తుంటే కుటుంబ పెద్ద వారిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆయనే తప్పు చేస్తే మిగిలినవారు సరిచేసేందుకు ప్రయత్నిస్తారు తప్ప ఎవరూ ప్రోత్సహించరు. కానీ మేమంతా వైసీపీ కుటుంబ సభ్యులమని గొప్పగా చెప్పుకొనే మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభలో ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశ్యించి చాలా నీచంగా మాట్లాడుతుంటే వారి పెద్ద జగనన్న ముసిముసినవ్వులు నవ్వుతూ సంతోషిస్తుంటారు.

గంట, అరగంటా అంటూ ఫోన్‌లో అశ్లీల సంభాషణలు చేసినవారిని ప్రోత్సహిస్తున్నట్లు వారికి మంత్రి పదవులిస్తారు. తమ ఎంపీ డర్టీ పిక్చర్ రిలీజ్ అయితే జిల్లా ఎస్పీ చేత ‘క్లీన్ యు’ సెన్సార్ సర్టిఫికేట్ ఇప్పిస్తారు. తమ ఎమ్మెల్సీ అనంతబాబు ఓ దళిత యువకుడిని హత్యచేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అనర్హత వేటు వేయరు. పింఛనులు, బియ్యం డోర్ డెలివరీ చేయడమే డీ సెంట్రలైజేషన్ అని నిన్ననే శాసనసభలో సరికొత్త భాష్యం చెప్పారు కనుక శవాన్ని డోర్ డెలివరీ చేయడం కూడా డీ సెంట్రలైజేషన్ అనుకోవాలేమో?వైసీపీ కుటుంబ పెద్ద తీరు ఈవిదంగా ఉంది గనుకనే మంత్రులు, ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారని చెప్పవచ్చు.

ADVERTISEMENT

నిన్న శాసనసభలో మంత్రి నాగార్జున టిడిపి ఎమ్మెల్యే శ్రీబాల వీరాంజనేయ స్వామి ని ఉద్దేశ్యించి, “నీకు చేతనైతే, నువ్వు నిజంగా దళితుడివైతే, నువ్వు దళితులకే పుడితే… టిడిపి నుంచి బయటకు వచ్చి మాట్లాడు” అంటూ చాలా అనుచితంగా మాట్లాడుతున్నపుడు సిఎం జగన్మోహన్ రెడ్డి సభలోనే ఉన్నారు. తన మంత్రి ప్రతిపక్ష సభ్యుడిని నోరెత్తకుండా ఎంత బాగా మాట్లాడుతున్నారో అని సంతోషించారే తప్ప వారించలేదు!

బడుగు బలహీనవర్గాలకు తన ప్రభుత్వం చాలా గౌరవిస్తుందని చెప్పుకొంటూ మంత్రుల చేత బస్సు యాత్ర చేయించి మరీ చాటింపు వేసుకొన్న సిఎం జగన్మోహన్ రెడ్డి, తన మంత్రి తన ఎదుటే సభలో ఓ దళిత ఎమ్మెల్యేని ఇంతగా అవమానిస్తుంటే సంతోషిస్తున్నారంటే అర్దం ఏమిటి?

తమ అధినేత జగన్ ఇటువంటివారిని మందలించకుండా వారి మాటలు విని ముసిముసినవ్వులు నవ్వుతూ సంతోషిస్తున్నప్పుడు ఇక మహిళా మంత్రులు మాత్రం వారిని అడ్డుకోగలరు? అందుకే రాష్ట్ర హోంశాఖకు ఓ మహిళ (తానేటి వనిత) మంత్రిగా ఉన్నప్పటికీ వారి తీరును తప్పపట్టలేకపోతున్నారనుకోవచ్చు.

ఇక రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కె. రోజాకు మొదటి నుంచి కాస్త నోటి దురుసు ఎక్కువే గనుక మాజీ మంత్రి కొడాలి నానిని ఆమె గట్టిగా వెనకేసుకువస్తున్నారు. మహిళలను, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను ఉద్దేశ్యించి కొడాలి నాని అన్నమాటలలో ఎటువంటి తప్పు లేదని, టిడిపి నేతలే ఆయన ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారని, మళ్ళీ మరోసారి అటువంటి ప్రయత్నం చేస్తే గట్టిగా బుద్ధి చెపుతామని మంత్రి ఆర్‌కె. రోజా హెచ్చరించారు.

ఈ రాజకీయాలను పక్కన పెడితే, కొడాలి నాని, గోరంట్ల మాధవ్‌, అంబటి రాంబాబు తదితరుల తీరు చూస్తున్న వైసీపీలో మహిళా ఎమ్మెల్యేలు, మహిళా మంత్రులు శాసనసభ లేదా బహిరంగసభలలో ధైర్యంగా వారి పక్కన కూర్చోగలరా?వారితో మాట్లాడగలరా?ఒకవేళ ఇబ్బందిగా ఉంటుందని భావిస్తే అర్దం ఏమిటి?

ADVERTISEMENT
Latest Stories