ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు వైదొలిగారు. ఈరోజు ఉదయం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన ఇరువురు రాజీనామా లేఖలను ఆయనకు అందజేశారు. దీనితో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో రెండు ఖాళీలు ఏర్పడినట్టు అయ్యింది.
ఈ నెలాఖరున రాజ్యసభ ఎన్నికలు అయిపోయాక వీటిని భర్తీ చెయ్యవచ్చు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో అదే సామాజికవర్గానికి చెందినవారిని తీస్కోవచ్చు. దీనిబట్టి ఒక కమ్మ, ఒక కాపుకు అదృష్టం వరించవచ్చు. గురజాల ఎమ్మెల్యే ఏరపతనేని శ్రీనివాస రావు లేదా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు అవకాశం దక్కవచ్చు.
కాపు కోటాలో జ్యోతుల నెహ్రూకు పదవి అవకాశం ఉంది. అదేవిధంగా కేంద్ర కేబినెట్లో టీడీపీ వారి స్థానంలో ఆంధ్రా వారికే అవకాశం ఇవ్వాలనుకుంటే హరిబాబుకు, పురంధేశ్వరికి అవకాశం రావొచ్చు. అయితే పురంధేశ్వరికి కేంద్రమంత్రి పదవి ఇస్తే ఆమెను ఏదో ఒక రాష్ట్రం నుండి రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది.



