
నేడు సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. కేంద్రం బడ్జెట్‌లో రాష్ట్రానికి చిల్లర పైసలు మాత్రమే విధిలించిందని ఓ పక్క వైసీపీ సన్నాయి నొక్కులు నొక్కుతుంటే, బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చినందుకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు సిఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళుతున్నారని సమాచారం.
అయితే అసలు కారణం వేరే ఉంది. ఈ నెల 5న ఢిల్లీ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉంది కనుక సిఎం చంద్రబాబు నాయుడు బీజేపి తరపున ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేయడానికి ఢిల్లీ వెళుతున్నారని సమాచారం.
Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?
ప్రధాని మోడీ ఢిల్లీ నుంచే యావత్ దేశాన్ని పాలిస్తున్నా, ఢిల్లీలో ఆమాద్మీ పార్టీ, దాని అధినేత అరవింద్ కేజ్రీవాల్ మారాం కొరకరాని కొయ్యగా మారారు. ఆమాద్మీ పార్టీ ఓడించాలని బీజేపి ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యపడటం లేదు.
పైగా పక్కనే ఉన్న పంజాబ్‌లో రాష్ట్రంలో కూడా ఆమాద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. కనుక ఈసారి ఎన్నికలలో ఆమాద్మీ పార్టీని ఓడించి బీజేపి అధికారంలోకి రాలేకపోతే ఆ పార్టీ, దాని అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరింత బలపడతారు. కనుక ఈసారి ఎట్టి పరిస్థితులలో ఓడించి తీరాలని మోడీ, అమిత్ షాలు చాలా పట్టుదలగా ఉన్నారు. కనుక వారి ఆహ్వానించినందునే సిఎం చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు.
Also Read – ఆప్ ఓటమికి బిఆర్ఎస్ స్కాములే కారణమా..?
ఎన్నికల ప్రచారానికి సిఎం చంద్రబాబు నాయుడుని ఆహ్వానించడానికి బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఏపీకి భారీగా నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తూ చాలా సాయపడుతోంది.
కనుక బీజేపిని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహాయపడుతున్నట్లుగానే ఢిల్లీని కూడా అభివృద్ధి చేస్తామని బీజేపి చెప్పుకుంటోంది. ‘బీజేపి చెపుతున్న మాటలు నిజమే’ అని సిఎం చంద్రబాబు నాయుడు ధృవీకరిస్తే, ఢిల్లీ ప్రజలకు బీజేపి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది.
Also Read – అరెస్ట్ అయితే ముఖ్యమంత్రి కారన్న మాట!
ఇక మరో కారణం ఏమిటంటే, ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిఎం చంద్రబాబు నాయుడు అమరావతి, పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేయిస్తున్నారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తూ, భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు రప్పించేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు.
కనుక అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ వంటి సిఎం చంద్రబాబు నాయుడు చేత ఎన్నికల ప్రచారం చేయిస్తే ఢిల్లీ ప్రజలని మెప్పించవచ్చని మోడీ, అమిత్ షాలు భావించడం సహహజం.
దేశరాజధాని ఢిల్లీలో కొన్ని ప్రాంతాలలో తెలుగువారు, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు చాలా మందే ఉన్నారు. కనుక సిఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం చేస్తే వారిని బీజేపి వైపు ఆకర్షించగలుగుతారు.
అయితే ఇందుకు ప్రతిగా కేంద్రం ఏపీకి మరింత ఉదారంగా నిధులు అందిస్తూ ఆర్ధికసాయం చేస్తూ, ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు, మెట్రో రైల్ ప్రాజెక్ట్ వంటివాటికి నిధులు, అనుమతులు మంజూరు చేస్తే ఏపీ ప్రజలు కూడా సంతోషిస్తారు.