Chandrababu Naidu

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ టిడిపి ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణలో టిడిపిని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు వారికి దిశానిర్దేశం చేశారు. త్వరలోనే తెలంగాణ టిడిపికి కొత్త అధ్యక్షుడుని నియమిస్తానని తర్వాత టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిద్దామని చంద్రబాబు నాయుడు చెప్పారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన తెలంగాణ శాసనసభ ఎన్నికలలో టిడిపి పోటీ చేయలేకపోయిందని చంద్రబాబు నాయుడు చెప్పారు.

తెలంగాణ ఎన్నికలలో టిడిపి పోటీ చేయకపోవడంపై చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఫలితాలు చూసిన తర్వాత ఆయన నిర్ణయం సరైనదని అందరూ గ్రహించారు. అంగీకరించారు. ఆనాడు ఏపీలో తనకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడాలని కేసీఆర్‌ ఏవిదంగా కోరుకున్నారో, చంద్రబాబు కూడా అలాగే కోరుకున్నారు. కనుకనే ఆ ఎన్నికలలో వెనక్కు తగ్గారు. తెలంగాణలో రేవంత్‌ రెడ్డి అధికారంలో వచ్చినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మద్య సయోధ్య ఏర్పడి పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఒకటొకటిగా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.

Also Read – గంట అరగంట వీరులకు అర్దమైంది కానీ దువ్వాడకు అర్ధం కాలే.. అందుకే..

ఈవిదంగా పరిస్థితులు చక్కబడుతున్నవేళ తెలంగాణలో టిడిపిని మళ్ళీ బలోపేతం చేయాలనే చంద్రబాబు నాయుడు ఆలోచన అర్దం చేసుకోవడం కష్టమే. ఒకటీ రెండూ కాదు అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

· తెలంగాణలో మొదటి నుంచి టిడిపి ఉంది. దానిని కేసీఆర్‌ నిర్వీర్యం చేయడంతో బలహీనపడింది. కనుక ఓ రాజకీయ పార్టీగా తెలంగాణలో టిడిపి యాక్టివ్‌గా ఉండటం అవసరమని భావిస్తున్నారా?

Also Read – విద్యార్థుల ఆత్మహత్యలు…పాపం ఎవరిదీ.?

· ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ బలహీన పడింది. కనుక టిడిపి నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన నేతలని మళ్ళీ వెనక్కు రప్పించి బిఆర్ఎస్ స్థానాన్ని టిడిపి భర్తీ చేయాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారా?

· తెలంగాణలో రేవంత్‌ రెడ్డి అధికారంలోకి రావడానికి పరోక్షంగా తోడ్పడ్డారు కనుక తెలంగాణలో టిడిపిని బలోపేతం చేసుకుంటే ఆయనకు అభ్యంతరం ఉండదని భావిస్తున్నారా?

Also Read – తెలంగాణలో కూడా సేమ్ సేమ్!

· రేవంత్‌ రెడ్డికి అత్యవసరమైనప్పుడు రాజకీయంగా సహకరించేందుకే తెలంగాణలో టిడిపిని బలోపేతం చేయాలనుకుంటున్నారా?

· బీజేపీతో దోస్తీకి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు కనుక ఆయనకు ఆ అవకాశం ఇవ్వకుండా తెలంగాణలో కూడా బీజేపీతో కలిసి ముందుకు సాగాలనుకుంటున్నారా?

· కానీ తెలంగాణలో టిడిపి బలోపేతం చేసుకునేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే, దాంతో కేసీఆర్‌ తెలంగాణ సెంటిమెంట్ రాజేసి బలపడే అవకాశం కూడా ఉంటుంది కదా?

· రాజకీయంగా బలహీనపడిన బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకోవడానికి కేసీఆర్‌కి చంద్రబాబు నాయుడే బలమైన సెంటిమెంట్ అస్త్రం అందించిన్నట్లవుతుంది కదా?

· ఒకవేళ తెలంగాణలో టిడిపిని బలోపేతం చేసుకునే ప్రయత్నాలు మొదలుపెడితే కాంగ్రెస్ పార్టీ ఏవిదంగా స్పందిస్తుంది?వంటి అనేక సందేహాలున్నాయి. వీటిలో ఏదైనా కారణం కావచ్చు.

తెలంగాణలో టిడిపిని మళ్ళీ బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు ఎందుకు అనుకున్నారో తెలీదు కానీ చాలా దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లే భావించవచ్చు. కానీ ఈ ఒక్క నిర్ణయంతో తెలంగాణలో ముఖ్యంగా… ముందుగా… బిఆర్ఎస్ పార్టీలోనే ప్రకంపనలు మొదలవుతాయి. త్వరలోనే అవి చూడవచ్చు.