ఏలూరు జిల్లా నూజివీడు భూ యాజమాన్య హక్కుల పత్రాల పంపిణి కార్యక్రమంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం జగన్ యదావిధిగా చంద్రబాబు, పవన్ ను ఉద్దేశించి తన ముందున్న స్క్రిప్ట్ పేపర్ చదివేసారు. మీ బిడ్డకు చంద్రబాబు మాదిరి ఒక దత్తపుత్రుడు లేడు, అబద్దాలను ప్రచారం చేసే ఒక ఈనాడు కానీ ఆంధ్ర జ్యోతి కానీ tv5 కానీ లేవు.
మీ బిడ్డకు ఏ రాజకీయ పార్టీలతో పొత్తులు లేవు. వైసీపీ పార్టీ పొత్తు కేవలం ప్రజలతోనే. తోడేళ్ళ గుంపు మొత్తం ఏకమై మిమ్మల్ని మోసం చేయడానికి సిద్ధపడ్డారు కానీ సింహం ఒంటరిగానే నడుచుకుంటూ వస్తుంది అంటూ సినిమా డైలాగ్స్ బాగానే అప్పచెప్పారు జగన్ గారు. అలాగే మీ బిడ్డకు ఈ ధైర్యం కూడా మీ వద్ద నుండే వచ్చింది అంటూ ప్రజలకు కూడా ఒక బిస్కెట్ వేశారు. అయితే ఇలా చెప్పుకోవడం ఒక రాజకీయ నాయకుడికి తప్పైనిసరే దాన్నెవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదు.
అయితే ఇక్కడ జగన్ చేసిన ప్రసంగంలో విమర్శించదగిన అంశం ఒకటి ఉంది. సింహం సింగల్ గా వస్తుంది., జగన్ అంటే పులివెందుల పులి., ఏ పార్టీలతో పొత్తు పెట్టుకునే దుస్థితి జగన్ కు ఉండదు.,పచ్చ మీడియా మాదిరి మాకు మద్దతు తెలిపే ఛానెల్స్ లేవు., బాబుకి మాదిరి పవన్ లాంటి దత్తపుత్రుడు మాకు లేడు అంటూ పదే పదే బహిరంగ సభలలో చెప్పుకునే జగన్ నిజంగా తనకు ప్రజల మీద అంత నమ్మకమే ఉంటే ప్రజల మధ్యకు వచ్చేందుకు “రోడ్లకు ఇరు వైపులా పరదాలు కట్టాల్సిన అవసరం ఏముంది”?
అలాగే తన ప్రభుత్వంలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలతో నిజంగా మంచే జరిగుంటే,అది చెప్పడానికి స్క్రిప్ట్ పేపరుతో పనేముంది? కనీసం చేసిన మంచిని చూసి చెప్పడానికి కూడా తంటాలు పడే మీరా సింహం? అంటూ ఎద్దేవా చేస్తున్న టీడీపీ శ్రేణులు. తమ ప్రత్యర్దులని విమర్శించాలన్నా ఎదురు పేపర్ లేకపోతే మాట ముందుకు కదలని పరిస్థితి మీ పులివెందుల పులిది అంటూ గతంలో జనసేన అధినేత పవన్ వ్యాఖ్యానించారు.
నిజంగా జగన్ కు ప్రజల పట్ల అంత నిబద్ధతే ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు జరిగిన అన్యాయాలపై బహిరంగ వేదిక పై చర్చించేందుకు సిద్ధమా అంటూ నారా లోకేష్ పలుమార్లు జగన్ కు సవాల్ కూడా విసిరారు.దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కూడా లోకేష్ ఇదే సవాల్ ను జగన్ కు ఇచ్చారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేకపోయారు.
ఒకటి రెండు మార్లు మీట్ ది ప్రెస్ నిర్వహించిన వాటికి కేవలం తన మద్దతుదారులకు మీడియా వారికీ మాత్రమే అనుమతి దక్కింది. అందులోను జగన్ చెప్పిన సమాధానాలు కొన్ని రోజుల పాటు సోషల్ మీడియా వారికీ పనితో పాటు వీక్షకులకు వినోదాన్ని కలిగించడంతో ఇక దానికి కూడా స్వస్తి పలకాల్సి వచ్చింది. రాజకీయ పార్టీల పొత్తు అనేది రాజకీయాలలో ఒక భాగం మాత్రమే అదేదో చంద్రబాబు తో మొదలు కాదు పవన్ తో ఆఖరు లేదు.
వైస్ రాజశేఖర్ రెడ్డి కూడా మొదటిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టింది కూడా ఇతర పార్టీలతో పొత్తులో పోటీ చేసే అనే విషయం వైసీపీ నేతలు మరచిపోతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే పొత్తు పెట్టుకోవడానికి రాజకీయ పార్టీలకు ఆ పార్టీల అధినేతలకు ధైర్యం ఉండాలి. ఎందుకంటే పొత్తు అంటేనే ఇతర పార్టీల నేతల గెలుపు కోసం తమ పార్టీ నేతలను త్యాగాలకు సిద్ధంచేయాలి.అలాగే పక్కపార్టీ నేతల గెలుపుకి కృషి చేయాలి. ఇదంతా ఎంతో రాజకీయ నేర్పుతో, ఓర్పుతో నెట్టుకురావాల్సిన అంశం.
ఒంటిరిగా పోటీ చేస్తే తమ పార్టీ నేతలకు సర్ది చెప్పుకుంటే సరిపోతుంది. కానీ పొత్తులో అలా కుదరదు. రెండు పార్టీల నేతలను సమన్వయ పర్చాల్సి ఉంటుంది. ఇది కత్తి మీద సాము వంటిదే. రాజకీయాలలో ఏది అంత ఈజీ కాదు. జగన్ కూడా 151 సీట్లను సాధించడం అంటే పెద్ద విషయమే. అలా అని అందరిని ఎగతాళి చేస్తా, అరెస్టులు చేస్తా అంటే ప్రజాస్వామ్యంలో అది కుదరని పని.ఒంటరి పోటీ చేయడానికే కాదు ఒంటరిగా ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా ధైర్యం ఉండాలి అనేది ఈ సింహం ఎప్పటికి గ్రహిస్తారో.




